Abn logo
May 25 2020 @ 19:20PM

స్వామీలపై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

విజయవాడ: స్వామీలపై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో స్వామీజీలకు కరోనా సోకిందా? జనసేన నేత పోతిన మహేష్‌ అని ప్రశ్నించారు. వెంకన్న ఆస్తులు అమ్ముతున్నా స్పందించరా అని నిలదీశారు. ఈ అన్న పాలనలో వ్యక్తుల మీద, కలియుగదైవం మీద దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. టీటీడీ భూముల అమ్మకం కూడా వైసీపీ వైరస్‌ బారినపడి సెంటుతో మొదలై రోడ్‌మ్యాప్‌ ఎక్కడి వరకు వెళ్తుందో? అని ప్రశ్నించారు. తిరుమల లడ్డూలను బజార్లో దొరికే వస్తువులా చేశారని పోతిన మహేష్‌ దుయ్యబట్టారు.

Advertisement
Advertisement
Advertisement