ఓసీపీ5 పనులను అడ్డుకున్న జనగామ గ్రామస్థులు

ABN , First Publish Date - 2022-01-19T06:06:35+05:30 IST

సింగరేణి ప్రభావిత గ్రామమై న జనగామ నిరుద్యోగులకు నూతనంగా నిర్మిస్తున్న ఓసీపీ 5లో ఉపాధి కల్పించడం లేదంటూ ప్రజలు మంగళవారం ఓసీపీ-5 పనులను అడ్డుకున్నారు.

ఓసీపీ5 పనులను అడ్డుకున్న జనగామ గ్రామస్థులు
ప్రాజెక్టు వద్ద ఆందోళన చేస్తున్న జనగామ గ్రామస్థులు

- ఉపాధి కల్పించడం లేదంటూ ఆందోళన

గోదావరిఖని, జనవరి 18: సింగరేణి ప్రభావిత గ్రామమై న జనగామ నిరుద్యోగులకు నూతనంగా నిర్మిస్తున్న ఓసీపీ 5లో ఉపాధి కల్పించడం లేదంటూ ప్రజలు మంగళవారం ఓసీపీ-5 పనులను అడ్డుకున్నారు. ఓసీపీ5 ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మట్టి తొలగిస్తున్న లారీలను నిలిపివేశా రు. జనగామ గ్రామానికి చెందిన కార్పొరేటర్‌ జనగామ కవితసరోజిని ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్‌ జనగామ నర్సయ్య, అర్కుటి శం కర్‌, తోకల రమేష్‌, మారం వెంకటేష్‌తో పాటు గ్రామానికి చెందిన నిరుద్యోగ యువకులు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. టుటౌన్‌ పోలీసులు ఘటన స్థ లానికి చేరుకుని ఆందోళన విరమించాల్సిందిగా కోరారు. సింగరేణి ఆర్‌జీ- 1 జీఎం కల్వల నారాయణతో గ్రామస్థులు ఫోన్‌లో మాట్లాడారు. చర్చలకు రావాలని విజ్ఞప్తిమేరకు ఆందోళన విర మించి జీఎం కార్యాలయంలో జీఎం నారాయణతో ప్రతినిధి బృందం చర్చించింది. ఈ సందర్భంగా జీఎం కూడా జనగామ గ్రామస్థులపై కొంత అసహనం వ్యక్తంచేశారు. తాము ఉద్యోగాలిస్తామని ఎక్క డా చెప్పలేదని, ఉపాధి కల్పించేందుకు అవసరమైన శిక్షణనిచ్చి సిఫార్సు చేస్తామని చెప్పామన్నారు. ప్రభావిత జనగా మ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. జనవరి 1వ తేదిన ఓబీ కాంట్రాక్టర్‌ను పిలిచి ఎమ్మెల్యే కోరుకం టి చందర్‌ సమక్షంలో చర్చిస్తామని హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-01-19T06:06:35+05:30 IST