జనార్దన స్వామి మాన్యంపై కన్ను

ABN , First Publish Date - 2020-05-31T11:28:16+05:30 IST

పట్టణంలోని కోవూరు రోడ్డులో జనా ర్దనస్వామి మాన్యం భూములను ఆక్రమించి ప్లాట్లు వేసేం దుకు జరుగుతున్న యత్నాన్ని ఆలయ అధికారులు శనివా రం అడ్డుకున్నారు.

జనార్దన స్వామి మాన్యంపై కన్ను

  • ఆక్రమించి లేఅవుట్‌కు యత్నం 
  • కౌలుదారుడే సూత్రధారి 
  • ఆలయ భూమిలో కచ్చారోడ్డు ఏర్పాటు 
  • అడ్డుకున్న అధికారులు..
  •  స్థలం చుట్టూ కంచె ఏర్పాటు 


కందుకూరు, మే 30: పట్టణంలోని కోవూరు రోడ్డులో జనా ర్దనస్వామి మాన్యం భూములను ఆక్రమించి ప్లాట్లు వేసేం దుకు జరుగుతున్న యత్నాన్ని ఆలయ అధికారులు శనివా రం అడ్డుకున్నారు. నాగేంద్రస్వామి పుట్ట, ఎర్రగుంటపా లెంల మధ్యలో కోవూరు రోడ్డుకి ఆనుకుని ఉన్న రూ.కోట్ల విలువ జేసే జనార్దనస్వామి ఆలయ భూమిని ఎకరం వరకు ప్లాట్లు వేసి విక్రయిం చేందుకు లేఅవుట్‌ సిద్ధం చేయటమే గాక కచ్చా రోడ్డు కూడా వేశారు. మూడేళ్ల క్రితం ఈ భూమిని కౌలుకి పాడుకు న్న ఆదెయ్య అనే వ్యక్తి భూమిని విక్రయించేందుకు సిద్ధపడ టం విశేషం. విషయం తెలుసుకున్న ఆలయ   ఈవో భైరాగిచౌదరి ఆ ప్రాంతానికి చేరుకుని పనిచేస్తున్న ఎక్సకవేటర్‌ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా భూమి కౌలు పాటదారుడు ఆదెయ్య ఆలయ అధికారులతో వాగ్వాదానికి దిగారు.


మూడేళ్ల క్రితం రూ.లక్ష చెల్లించాను, ఇందులో ఏమి పంట పండలేదు.. అంతమాత్రం అమ్ముకునే హక్కు తనకు లేదా అంటూ ఆయన వాదించటం విశేషం. భూమి సాగు కోసం కౌలుకు తీసుకున్న వారికి విక్రయించుకునే హక్కు ఎక్కడిదని ఆలయ అధికారులు ప్రశ్నించగా ఇదేవిధంగా అనేక ఎకరాలు విక్రయించటమే గాక పక్కా భవనాల నిర్మా ణం కూడా జరిగిపోయిందని, అప్పుడల్లా ఊరకే ఉండి తన వరకు వచ్చేసరికి ఆపటం భావ్యం కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సర్వే నెంబరులో 5 ఎకరాలను ఇలాగే అమ్ముకున్నారని తన ఎకరం తాను అమ్ముకోవద్దా అని ఆయన వాదించటం విశేషం. దీంతో విస్తుపోయిన ఆలయ అధికా రులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అక్కడ ఉన్న కచ్చా రోడ్డుని వదిలేసి మిగిలిన మొత్తం భూమికి చుట్టూ ఫెన్షింగ్‌ వేయించారు.

Updated Date - 2020-05-31T11:28:16+05:30 IST