Abn logo
Sep 25 2021 @ 22:02PM

తాట తీస్తా: పవన్‌ కల్యాణ్

అమరావతి: రాష్ట్రంలోని వైసీపీ నేతలకు జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్  తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో సినీ పరిశ్రమకు ఇబ్బందులు కల్గిస్తే తాట తీస్తానని పవన్‌ కల్యాణ్ హెచ్చరించారు. ఏపీలో ఉన్నది వైసీపీ రిపబ్లిక్‌ కాదని, ఇండియన్‌ రిపబ్లిక్‌ అని వైసీపీ నేతలకు పవన్ గుర్తు చేశారు. 


‘‘వైఎస్ వివేకా హత్య గురించి ఎందుకు మాట్లాడరు?. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో కోడికత్తితో ఒక నాయకుడ్ని పొడిచారు. ఆకేసు ఏమైందని అడగాలి?. ఆరేళ్ల చిన్నారి అమానుషంగా హత్యకు గురైంది. ఆ విషయంపై ఎందుకు మాట్లాడరు?. వైసీపీ సానుభూతిపరులు వ్యభిచారానికి మద్దతు పలికారు. ఆ విషయంపై చర్చలు పెట్టండి. టీడీపీ ఉన్నప్పుడు కాపు రిజర్వేషన్లు గురించి మాట్లాడి, వైసీపీ ఉన్నప్పుడు దానిపై ఎందుకు మాట్లాడరు. ఇడుపుల పాయలో నేలమాళిగలు ఉన్నాయని చెబుతారు, వాటిపై కథనాలు నడిపితే వాళ్లు ఊరుకుంటారా?, పొలిటికల్ క్రైం గురించి మాట్లాడండి, సమాజానికి పనికొచ్చే విషయాలు మాట్లాడండి. నా సినిమా ఆపేస్తే భయపడరు, సినిమా నటులకు ఊరికే డబ్బులు రావు.  అక్రమ ఆర్జిత నాయకులపై దృష్టి పెట్టండి.. సినిమా వాళ్లపై కాదు. నాపేరు చెప్పి సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టకండి. చిత్రపరిశ్రమపై కన్నెత్తి చూడొద్దు.. కాలిపోతారు.’’ అని పవన్ హెచ్చరించారు. 


క్రైమ్ మరిన్ని...