Abn logo
Sep 20 2021 @ 23:34PM

జనసేన ఆవిర్భావం ఇక్కడే!

మాట్లాడుతున్న నాదేండ్ల మనోహర్‌




సిక్కోలుతో విడదీయరాని బంధం

2 నుంచి నిరసన కార్యక్రమాలు

పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 20 : సిక్కోలుతో జనసేనది విడదీయరాని బంధమని.. పార్టీ ఇక్కడే ఆవిర్భవించిందని పార్టీ పొలిటికల్‌ అఫైర్స్‌ కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ గుర్తుచేశారు. సోమవారం శ్రీకాకుళం నగరంలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జనసేన నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. మనోహర్‌ మాట్లాడుతూ తితలీ తుపాను సమయంలో పక్క జిల్లాలో ఉంటూ పాదయాత్ర చేస్తున్న జగన్‌..ఇక్కడి బాధితులను పరామర్శించలేదని గుర్తు చేశారు. ధైర్యం ఉంటే ఇప్పుడు జిల్లాలో పాదయాత్ర చేయాలని సవాల్‌ విసిరారు. భవన నిర్మాణ కార్మికుల ఉపాధిని కొల్లగొట్టారని ఆరోపించారు. మూడు లక్షల ఉద్యోగాల హామీ ఏమైందని ప్రశ్నించారు. యువత ఉద్యోగాలు లేక రోడ్డున పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు అధికంగా ఉన్నాయని చెప్పారు. రహదారులు మరమ్మతులు చేయలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. అందుకే పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌ రంగంలోకి దిగారని చెప్పారు. అక్టోబరు 2 నుంచి నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రకటించారు. ప్రభుత్వం చికెన్‌, మటన్‌, సినిమా టిక్కెట్లను విక్రయించే స్థాయికి దిగజారడాన్ని చూపి ప్రజలు నవ్వుకుంటున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే పవన్‌కల్యాణ్‌ సీఎం కావాలని అభిప్రాయపడ్డారు. జిల్లాలో ఎంపీటీసీ స్థానాలను జనసేన గెలుపొందడం శుభసూచికమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేసి మునిసిపాల్టీల్లో విజయం సాధించాలని సూచించారు. సమావేశంలో జనసేన నాయకులు పి.సందీప్‌, కాంతిశ్రీ, విశ్వక్‌సేన్‌, సర్వేశ్వరరావు, రామ్మోహన్‌, యశస్విని తదితరులు పాల్గొన్నారు. ఇటీవల వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఆమదాలవలస జనసేన ఇన్‌చార్జి పేడాడ రామ్మోహనరావును మనోహర్‌ పరామర్శించారు.