Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాష్ట్రంలో ప్రజలు నిస్పృహతో ఉన్నారు: నాదెండ్ల మనోహర్‌

గుంటూరు: వైసీపీ పాలన పట్ల  రాష్ట్రంలోని ప్రజలు నిస్పృహతో ఉన్నారని జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ అన్నారు. ప్రభుత్వ పథకాల పేర్లలో మాత్రమే జగనన్న కనబడతారన్నారు. వాస్తవానికి ఈ అన్న ఎవరికీ కనబడడు, వినపడడు, ఓదార్చడని ఆయన ఎద్దేవా చేశారు. పెన్షన్లు, రేషన్ కార్డులు, పేపర్ ప్రకటనల్లో మాత్రమే దర్శనమిస్తారన్నారు. ప్రజా బలం ఉంటే స్థానిక ఎన్నికల్లో దౌర్జన్యాలెందుకని ఆయన ప్రశ్నించారు. తప్పుడు జాబ్ క్యాలెండర్‌తో యువతను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది మనోహర్‌ ఆరోపించారు. 

Advertisement
Advertisement