Abn logo
Sep 27 2021 @ 14:05PM

భారత్ బంద్‌కు ఏపీ ప్రభుత్వ మద్దతుపై నాదెండ్ల విసుర్లు

అమరావతి: భారత్ బంద్‌కు ఏపీ ప్రబుత్వం మద్దతు ఇవ్వడంపై  జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ట్విట్టర్ వేదికగా విసుర్లు విసిరారు. ‘‘పార్లమెంట్‌లో మౌనం... రాష్ట్రంలో భారత్ బంద్‌కు జై.. మీ పార్టీ ద్వంద్వ వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలి. ఏపీలో రైతులకు ధాన్యం డబ్బులు ఇవ్వరు.. నకిలీ విత్తనాలు, నకిలీ పురుగు మందులు కూడా ఆపరు. ఇంకెప్పుడు తీర్చేది రైతుల కష్టాలు’’ అంటూ నాదెండ్ల మనోహర్ ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption