Advertisement
Advertisement
Abn logo
Advertisement

భరోసా లేని రైతు భరోసా కేంద్రాలు: నాదెండ్ల

గుంటూరు: రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలతో రైతులకు ఏ మాత్రం భరోసా లేదని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి నియోజకవర్గంలో వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను రెండో రోజు ఆయన పరిశీలించారు. పెదరావూరులో పంట నష్టపోయిన  రైతులతో మాట్లాడారు. అధికారులు పంట నష్ట నివారణ అంచనాలు వేయడంలో విఫలమయ్యారన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఏ మాత్రం  భరోసా లేదన్నారు. ప్రభుత్వం రైతులకు తక్షణ ఆర్థిక సహాయం క్రింద పది వేలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు అండగా ఉండి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఆయన పేర్కొన్నారు. Advertisement
Advertisement