ఇది రాష్ట్ర ఉత్సవమేనా?...: Potina mahesh

ABN , First Publish Date - 2021-10-08T17:31:11+05:30 IST

దసర మహోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి రెండో రోజు కూడా వచ్చామని... ప్రముఖులు, తెలిసిన వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు.

ఇది రాష్ట్ర ఉత్సవమేనా?...: Potina mahesh

విజయవాడ: దసర మహోత్సవాల సందర్భంగా అమ్మవారి దర్శనానికి రెండో రోజు కూడా వచ్చామని... ప్రముఖులు, తెలిసిన వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ అన్నారు. దసరా ఉత్సవాలలో పనులు చేసేవారికి సదుపాయాలు లేవన్నారు. దసరా రాష్ట్ర ఉత్సవం అయితే బడ్జెట్ ఎంత అని ప్రశ్నించారు. ఇది రాష్ట్ర ఉత్సవమేనా అని నిలదీశారు. రూ.70 కోట్ల నిధులు ఎందుకు ఇంకా అమ్మవారి ఖాతాకి రాలేదని ఆయన అడిగారు. ఇది రాష్ట్ర ఉత్సవంలా లేదని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్సవంలా రంగులేశారని విమర్శించారు. అన్యమత ప్రచారం‌ వైసీపీ నాయకులే నిన్న చేయించారని ఆరోపించారు. ఆలయం ఏర్పాటు చేసిన స్క్రీన్స్‌లో ఎలా అన్యమత ప్రచారం వచ్చిందని ఆయన ప్రశ్నించారు. స్క్రీన్స్ కాంట్రాక్ట్ తీసుకున్న వ్యక్తి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నలుగురు ఈఈలు, ప్రిన్సిపల్ సెక్రెటరీ ఏం చేస్తున్నారని నిలదీశారు. ఇతర ఆలయాల ఈఓలను నలుగురిని తీసుకొచ్చారన్నారు. ఉత్సవ శోభ ఏమైందని... ఐరన్ ఫ్రేం ఏమైందని అన్నారు. మామిడి తోరణాలు కూడా లేవని విమర్శించారు. ఆధ్యాత్మిక కేంద్రమా... వ్యాపార కేంద్రమా అని ప్రశ్నించారు. సీఎం పట్టువస్త్రాలు సమర్పించే నాటికైనా ఇవన్నీ సరి చేయాలన్నారు. ఒక వ్యక్తి ఆలయంలో చనిపోతే సంప్రోక్షణ ఎందుకు జరగలేదని ప్రశ్నించారు. జనసేన ఎప్పుడూ అమ్మవారికి కాపలాదారుగా ఉంటుందని స్పష్టం చేశారు. అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేసి ఉత్సవాలు సవ్యంగా పూర్తిచేయాలని పోతిన మహేష్ సూచించారు. 

Updated Date - 2021-10-08T17:31:11+05:30 IST