ఇదేనా రహదారుల అభివృద్ధి?

ABN , First Publish Date - 2022-07-17T06:33:21+05:30 IST

రహదార్లను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫల మైందని జనసేన నాయకుడు బీవీ రావు అన్నారు.

ఇదేనా రహదారుల అభివృద్ధి?
గుర్వాయిపాలెంలో గోతుల్లో రొయ్య పిల్లలు వదులుతూ జనసేన నాయకుల నిరసన

దెబ్బతిన్న రహదారుల వద్ద జనసేన నిరసన

సీఎం ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్న

గుంతలో రొయ్య పిల్లలు వదిలి వినూత్న నిరసన

తక్షణం మరమ్మతులు చేపట్టాలని డిమాండ్‌


కైకలూరు, జూలై 16: రహదార్లను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం విఫల మైందని జనసేన నాయకుడు బీవీ రావు అన్నారు. శనివారం వరహాపట్నం– శీతనపల్లి రహదారి, ఆలపాడు– కొల్లేటికోట రహదారుల్లో జనసేన ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. వర్షాలకు గుంతలు నీటితో నిండి వాహనదారులు ప్రమాదాలకు గురై ఆస్పత్రుల పాలవుతున్నా ప్రభుత్వం రహదార్ల నిర్మాణం చేపట్టకపోవడం దారుణమన్నారు. తక్షణమే రహదార్లను మరమ్మతులు చేప ట్టాలని  డిమాండ్‌ చేశారు.  నాయకులు తోట లక్ష్మి, కొల్లి బాబి, పన్నాస సుబ్బారావు, శొంఠి రాజేశ్వరి, శివ, వడుపు రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ముసునూరు: వైసీపీ పాలనలో రాష్ట్రాభివృద్ధి కుంటుపడిందని ముసు నూరు మండల జనసేన అధ్యక్షుడు అబ్బూరి రవికిరణ్‌ ఆరోపించారు. శనివారం నూజివీడు – ఏలూరు ప్రధాన రహదారి గోపవరంలో గోతుల వద్ద   జన సైనికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రవికిరణ్‌ మాట్లాడుతూ  నూజివీడు ఎమ్మెల్యేకు ధ్వంసమైన  రోడ్లు  కనిపించటం లేదా అని ప్రశ్నించా రు. ఈ రహదారులపై ప్రయాణం చేయాలంటే ప్రజలు భయాందోళ చెందు తున్నారని,  తక్షణమే రహదారుల అభివృద్ధి చేయకుంటే  నిరసన ఉధృతం చేస్తామన్నారు.  ఉపాధ్యక్షుడు బొట్ల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

కలిదిండి: గుర్వాయిపాలెంలో జనసేన నేతలు శనివారం ‘గుడ్‌ మార్నింగ్‌ సీఎం సార్‌’ నిర్వహించారు. గుర్వాయిపాలెం – పెదలంక రహదారిపై గుంతల్లో నిల్వ ఉన్న నీటిలో రొయ్య పిల్లలను వదిలి వినూత్న నిరసన తెలిపారు. శిథిల రహదారులకు మరమ్మతులు చేసేందుకు ఎమ్మెల్యే  కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. నల్లగోపుల చలపతిరావు, సిరిపురపు రాజబాబు, బెల్లంకొండ వెంకన్న బాబు, కనకదుర్గ, తోట రమాదేవి, తమనాల శ్రీనివాస్‌, రాజేష్‌, నాగార్జున, విజయ్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-17T06:33:21+05:30 IST