వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: జనసేన

ABN , First Publish Date - 2020-09-29T23:17:33+05:30 IST

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని జనసేన అధికార ప్రతినిధి మండలి రాజేష్ విమర్శించారు. కృష్ణలంక వరద ప్రాంతాలలో రాజేష్

వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: జనసేన

విజయవాడ: వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని జనసేన అధికార ప్రతినిధి మండలి రాజేష్ విమర్శించారు. కృష్ణలంక వరద ప్రాంతాలలో రాజేష్, ఇతర నాయకులు పర్యటించారు. ప్రకాశం బ్యారేజీ దిగువన రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టలేదన్నారు. గత ప్రభుత్వం నిధులు లేవంటూ అడ్డుగోడ పనులు మధ్యలోనే అటకెక్కించేసిందని ఆరోపించారు. వైసీపీ నాయకులు అధికారంలోకి వచ్చిన ఏడాదిలో నిర్మిస్తామన్నారని గుర్తుచేశారు. కానీ 17 నెలలు గడచినా అడ్డు గోడ పనులు ప్రారంభించలేదని ధ్వజమెత్తారు. వరదల్లో జనం మునుగుతున్నా కూత వేటు దూరంలో ఉన్న ముఖ్యమంత్రికి చీమ కుట్టినట్టయినా లేదన్నారు. కృష్ణా నది రిటైనింగ్ వాల్ నిర్మాణం వెంటనే పూర్తి చేయకుంటే నిరాహార దీక్ష చేపడతామని చెప్పారు.

Updated Date - 2020-09-29T23:17:33+05:30 IST