31న పల్స్‌పోలియో

ABN , First Publish Date - 2021-01-16T05:51:29+05:30 IST

పల్స్‌పోలియో తేదీ ఎట్టకేలకు ఖరారైంది. తొలుత ఈ నెల 17వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినా కరోనా టీకా వేయాలన్న ఉద్దేశంతో వాయిదా వేసింది.

31న పల్స్‌పోలియో

నెల్లూరు(వైద్యం), జనవరి 15 : పల్స్‌పోలియో తేదీ ఎట్టకేలకు ఖరారైంది.  తొలుత ఈ నెల 17వ తేదీన ఈ కార్యక్రమం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినా కరోనా టీకా వేయాలన్న ఉద్దేశంతో వాయిదా వేసింది. శనివారం నుంచి  కరోనా టీకా పంపిణీ మొదటి విడత ప్రారంభం అవుతుండటంతో నెలాఖరులో పల్స్‌ పోలియో నిర్వహణకు అనుమతిచ్చింది. కాగా, ఇప్పటికే జిల్లాలో పోలియో నియంత్రణ చుక్కల మందు పంపిణీకి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఐదేళ్లలోపు చిన్నారులను 3,38,938 మందిని గుర్తించి, వారందరికీ మూడు రోజులపాటు పోలియో చుక్కలు వేసేందుకు కార్యాచరణ రూపొందించారు. వీరిలో హైరిస్క్‌ చిన్నారులు 7,064 మంది ఉన్నట్లు గుర్తించారు. 2627 బూత్‌ల ద్వారా చుక్కల మందు వేయనున్నారు. 31వ తేదీన ఈ బూత్‌ల ద్వారా, ఆ తర్వాత రెండు రోజులు ఇంటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారు.  

Updated Date - 2021-01-16T05:51:29+05:30 IST