Abn logo
Sep 28 2021 @ 08:49AM

దళితులకు దళితు బంధు ఇచ్చినట్లు..రజకులకు రజక బంధు ఇవ్వాలి: జంగపల్లి ఐలయ్య

కరీంనగర్/ అక్కన్నపేట: తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమ నాయకురాలు చాకలి (చిట్యాల) ఐలమ్మ గారి జయంతి ఉత్సవాలు సోమవారం అక్కన్న పేట మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అక్కన్నపేట గ్రామ సర్పంచ్ ముత్యాల సంజీవరెడ్డి ఐలమ్మ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రజక సంఘం అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య మాట్లాడుతూ..చాకలి ఐలమ్మ ఆశయ సాధన కోసం ప్రభుత్వం పాటుపడాలని విజ్ఞప్తి చేశారు. చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రజకులు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడి పోయారని దళితులకు దళిత బంధు ఇచ్చినట్లుగానే రజకులకు రజక బంధు ప్రకటించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు అర్హులైన విద్యార్థులకు స్కాలర్‎షిప్‎లు మంజూరు చేయాలని కోరారు. అంతేకాకుండా రజకులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కూడా మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రజకులను ఎస్సీ జాబితాలో కూడా చేర్చాలని ఐలయ్య ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ రజక సంఘం అధ్యక్షులు తరిగొప్పుల పరుశరాములు, తరిగొప్పుల సదయ్య, జంగాలపల్లి శ్రీనివాస్, బందారం శ్రీనివాస్, తంగళ్ళపల్లి రవి, జంగపల్లి రఘుపతి, ఊళ్ళేంగుల రాజు తదితరులు పాల్గొన్నారు.