Abn logo
Sep 28 2021 @ 09:06AM

అక్కన్నపేట మండలంలో భారత్ బంద్‌ పాక్షికం..

కరీంనగర్/అక్కన్నపేట: కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ అఖిలపక్ష పార్టీలు ఇచ్చిన భారత్‌ బంద్‌ సోమవారం అక్కన్నపేట మండలంలో పాక్షికంగా జరిగింది. కేంద్రంలో ఏఐసీసీ పిలుపుమేరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో భారత్ బంద్‎కు పిలుపునిచ్చారు. బంద్ పిలుపు మేరకు మండలంలో తెరిచి ఉన్న కిరాణా షాపులు, వ్యాపార దుకాణాలను మరియు పాఠశాలను మూసివేయించారు. పలుచోట్ల మోటార్‌సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దుకాణాలను బంద్‌ చేయించారు. రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను అక్కన్నపేట పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‎కు తరలించారు. అక్రమ అరెస్ట్‎లు చేయడం సరికాదని ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ బంద్‎ కార్యక్రమంలో భాగంగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, కట్కూర్ సింగల్విoడో వైస్ చైర్మన్ ముకుంద రెడ్డి, ఎస్టీ సెల్ ప్రెసిడెంట్ గుగులోత్ రాంబాబు నాయక్, మాజీ ఎంపిటిసి భాస్కర్ నాయక్, బిసి సెల్ ప్రెసిడెంట్ సుగుర్తి బాలరాజ్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చొక్కం గణేష్ తదితరులు పాల్గొన్నారు.