Oct 23 2021 @ 16:19PM

Janhvi Kapoor బెల్లీ డ్యాన్స్.. నెటిజన్లు ఫిదా!

అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా తెరంగేట్రం చేసిన జాన్వీకపూర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అటు నటిగా, ఇటు గ్లామరస్ క్వీన్‌గా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. అలాగే డ్యాన్సర్‌గా కూడా సత్తా చాటుతోంది. ఇక, సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుంటోంది. హాట్ హాట్ ఫొటోలను పోస్ట్ చేస్తూ అభిమానులకు అందాల విందు అందిస్తోంది. జాన్వీ తాజాగా తన స్నేహితురాలు సారా అలీఖాన్‌తో కలిసి రణ్‌వీర్ సింగ్ నిర్వహిస్తున్న `ది బిగ్ పిక్చర్` కార్యక్రమానికి హాజరైంది. ఆ క్విజ్ షోలో సారా, రణ్‌వీర్‌తో కలిసి జాన్వి చేసిన అల్లరి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఆ షోలో కన్ను కొట్టడం ఎలాగో చూపించిన జాన్వి.. సారా, రణ్‌వీర్‌కు బెల్లీ డ్యాన్స్ నేర్పించింది. దానికి సంబంధించిన ప్రోమో వీడియోను కార్యక్రమ నిర్వాహకులు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జాన్వి బెల్లీ డ్యాన్స్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. లాక్‌డౌన్ సందర్భంగా దొరికిన విరామ సమయంలో బెల్లీ డ్యాన్స్ నేర్చుకున్నట్టు జాన్వి తెలిపింది.