Japan: పేలిన అగ్నిపర్వతం...హెచ్చరిక జారీ

ABN , First Publish Date - 2021-09-17T13:36:49+05:30 IST

జపాన్ దేశంలోని నైరుతి ప్రాంతంలో అగ్నిపర్వతం పేలిన ఘటనతో జపాన్ ప్రభుత్వం శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది....

Japan: పేలిన అగ్నిపర్వతం...హెచ్చరిక జారీ

టోక్యో: జపాన్ దేశంలోని నైరుతి ప్రాంతంలో అగ్నిపర్వతం పేలిన ఘటనతో జపాన్ ప్రభుత్వం శుక్రవారం హెచ్చరిక జారీ చేసింది. కగోషిమా ప్రిఫెక్చర్‌లోని మౌంట్ ఓటేక్ లో జరిగిన విస్ఫోటనం ఘటనలో ఎవరూ గాయపడినట్లు వార్తలు వెలువడలేదు. అగ్నిపర్వతం విస్పోటనం వల్ల వందల మీటర్ల దూరంలో పెద్ద రాళ్లు పడ్డాయి. అగ్నిపర్వతం పేలుడు వల్ల రెండు కిలోమీటర్ల దూరంలో రాళ్లు పడవచ్చని జపాన్ మెట్రోలాజికల్ ఏజెన్సీ హెచ్చరించింది.ఈ ఏడాది మార్చిలోనూ మౌంట్ ఒటేక్ వద్ద ఇదే విధమైన విస్ఫోటనం జరిగింది. ఆ సమయంలో జపాన్ వాతావరణ సంస్థ కూడా మూడో లెవల్ హెచ్చరికను జారీ చేసింది.జపాన్ దేశంలో అగ్నిపర్వతాల పేలుళ్లతో పాటు భూకంపాలు సంభవించే ఫసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతాలున్నాయి.


Updated Date - 2021-09-17T13:36:49+05:30 IST