భారత్‌ను నిషిద్ధ దేశాల జాబితాలో చేర్చిన జపాన్

ABN , First Publish Date - 2020-05-29T02:17:33+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌ ప్రభుత్వం విదేశీ పర్యటకుల విషయంలో కఠిన నిబందనలు అమలు చేస్తోంది.

భారత్‌ను నిషిద్ధ దేశాల జాబితాలో చేర్చిన జపాన్

టోక్యో: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జపాన్‌ ప్రభుత్వం విదేశీ పర్యటకుల విషయంలో కఠిన నిబందనలు అమలు చేస్తోంది. అనేక దేశాల ప్రజలను తమ దేశంలోకి అనుమంతిచేది లేదని స్పష్టం చేస్తోంది. తాజాగా ఈ నిషిద్ధ దేశాల జాబితాలోకి భారత్‌లో పాటూ మరో పది దేశాలు వచ్చి చేరాయి. ఈ మేరకు ప్రధాని షింజో అబే ఓ ప్రకటన చేశారు. పర్యటకులతో పాటూ జపాన్‌లో శాశ్వతి నివాస అనుమతి కలిగిన వారు, వారి జీవితభాగస్వాములు, పిల్లలకు కూడా వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. జపాన్‌లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తాజా లెక్కల ప్రకారం జాపాన్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 17 వేలను దాటిపోగా.. 876 మరణాలు సంభవించాయి. 

Updated Date - 2020-05-29T02:17:33+05:30 IST