టీకా పాస్‌పోర్ట్‌పై జపాన్ కీలక ప్రకటన!

ABN , First Publish Date - 2021-06-18T05:44:04+05:30 IST

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. జపాన్ ప్రయాణికుల

టీకా పాస్‌పోర్ట్‌పై జపాన్ కీలక ప్రకటన!

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు అమలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. జపాన్ ప్రయాణికులకు కొవిడ్ 19 వ్యాక్సిన్ పాస్‌పోర్ట్‌ను ఇవ్వాలని ఆ దేశ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది. విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు జూలై నుంచి పేపర్ ఆధారిత వ్యాక్సినేషన్ సర్టిఫికేట్‌ను అందించేందుకు జపాన్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని ప్రభుత్వ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఇదిలా ఉంటే.. కొవిడ్ నేపథ్యంలో ట్యోక్యోలో ప్రస్తుతం అమలవుతున్న ఎమర్జెన్సీ జూన్ 20తో ముగుస్తుందని ఆ దేశ ప్రధాని ఓ ప్రకటనలో తెలిపారు. 


Updated Date - 2021-06-18T05:44:04+05:30 IST