Abn logo
Sep 27 2021 @ 23:18PM

సూమోలకే సూమో.. రిటైర్ అవుతున్నాడు

టోక్యో: ప్రముఖ సూమో రెజ్లింగ్ క్రీడాకారుడు హకుహో(36) తన క్రీడాజీవితానికి ముగింపు పలికేందుకు నిర్ణయించుకున్నాడు. కాలి గాయం కారణంగానే ఆయన తప్పుకోవాలని నిర్ణయించారు. దీంతో..ఈ క్రీడకు సంబంధించి ఓ అద్భుత శకం ముగిసిపోయిందని సూమో అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. హకుహో అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించాల్సి ఉంది.  1985లో మంగోలియాలో జన్మనించిన హకుహో..  15 ఏళ్ల వయసులో జపాన్‌కు వలసవెళ్లాడు. 2001లో సూమో క్రీడాకారుడిగా తన ప్రయాణం ప్రారంభించాడు. ఇప్పటివరకూ 1184 విజయాలు అందుకుని ఆల్ టైం రికార్డు నెలకొల్పాడు. ఏకంగా 45 టోర్నమెంటులలో విజేతగా నిలిచారు. 2019లో ఆయనకు జపాన్ పౌరసత్వం లభించింది. దీంతో..జపాన్‌లో ఓ సూమో శిక్షణ కేంద్రాన్ని నెలకొల్పే హక్కు హకుహోకు దక్కింది. గ్రాండ్ ఛాంపియన్‌గా(యోకోజునా) గుర్తింపు పొందిన హకుహోకు జపాన్‌లో ఎందరో అభిమానులు ఉన్నారు.

తాజా వార్తలుమరిన్ని...