మార్ష్‌ స్థానంలో హోల్డర్‌

ABN , First Publish Date - 2020-09-24T09:09:03+05:30 IST

గాయం కారణంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మార్ష్‌ స్థానాన్ని వెస్టిండీస్

మార్ష్‌ స్థానంలో హోల్డర్‌

దుబాయ్‌: గాయం కారణంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. మార్ష్‌ స్థానాన్ని వెస్టిండీస్‌ కెప్టెన్‌ జాసన్‌ హోల్డర్‌తో భర్తీ చేయనున్నట్టు సన్‌రైజర్స్‌ యాజమాన్యం తెలిపింది. బెంగళూరుతో మ్యాచ్‌లో మార్ష్‌ కాలికి గాయమైంది. దీంతో అతడు బౌలింగ్‌ చేయలేక పోయాడు. తప్పనిసరి పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు దిగినా.. ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక పోయాడు. 

Updated Date - 2020-09-24T09:09:03+05:30 IST