జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో రికార్డు

ABN , First Publish Date - 2021-09-07T01:45:40+05:30 IST

టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఇంగ్లండ్‌తో ది ఓవల్‌లో

జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో రికార్డు

లండన్: టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఖాతాలో మరో రికార్డు వచ్చి చేరింది. ఇంగ్లండ్‌తో ది ఓవల్‌లో జరుగుతున్న నాలుగో టెస్టులో ఒల్లీ పోప్ వికెట్‌ను పడగొట్టిన బుమ్రా టెస్టుల్లో అత్యంత వేగంగా 100 వికెట్లు పడగొట్టిన 8వ ఇండియన్ పేసర్‌గా రికార్డులకెక్కాడు. ఈ క్రమంలో  టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ రికార్డును బద్దలుగొట్టిన బుమ్రా.. రవీంద్ర జడేజా రికార్డును సమం చేశాడు. కపిల్ 25 టెస్టుల్లో 100 వికెట్లు సాధించగా, బుమ్రా 24వ మ్యాచ్‌లోనే ఆ ఘనత సాధించాడు. జడేజా కూడా 24వ టెస్టులోనే వంద వికెట్లు సాధించాడు. ఇక, వంద వికెట్లు పడగొట్టిన 23వ భారత బౌలర్‌గానూ బుమ్రా రికార్డులకెక్కాడు.  


ఇక, అత్యంత వేగంగా 100 టెస్టు వికెట్లు తీసిన భారత బౌలర్లలో బమ్రా కంటే ముందు కపిల్ దేవ్ (25), ఇర్ఫాన్ పఠాన్ (28), మహమ్మద్ షమీ (29), జవగళ్ శ్రీనాథ్ (30), ఇషాంత్ శర్మ (33) ఉన్నారు. 

Updated Date - 2021-09-07T01:45:40+05:30 IST