జాతీయ మహాసభ విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2021-10-21T03:30:17+05:30 IST

ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకు నవంబరు 5న హైద్రాబాద్‌లో నిర్వహిస్తున్న మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభ విజయవంతం చేయాలని ఎంఎస్‌ఎఫ్‌ డివిజన్‌ ఇంచార్జి పల్లిపాటి మస్తాన్‌ అన్నారు.

జాతీయ మహాసభ విజయవంతం చేయండి
వాల్‌పోస్టర్లు ఆవిష్కరిస్తున్న ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు

వెంకటగిరి(టౌన్‌), అక్టోబరు 20: ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత సాధనకు నవంబరు 5న హైద్రాబాద్‌లో నిర్వహిస్తున్న మాదిగ ఉద్యోగుల 5వ జాతీయ మహాసభ విజయవంతం చేయాలని ఎంఎస్‌ఎఫ్‌ డివిజన్‌ ఇంచార్జి పల్లిపాటి మస్తాన్‌ అన్నారు. బుధవారం స్థానిక విశ్వోదయ జూనియర్‌ కళాశాలలో ఎంఎస్‌ఎఫ్‌ వెంకటగిరి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో కరపత్రం ఆవిష్కరించారు. సునీల్‌ అనిల్‌, నాగరాజు, వెంకటేష్‌, వెంకటాద్రి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-21T03:30:17+05:30 IST