Sep 26 2021 @ 01:20AM

మరో వంద చిత్రాలు చేయగలను!

తుమ్మలపల్లి రామసత్యనారాయణ


‘‘కమర్షియల్‌ పరంగా... జయాపజయాలకు అతీతంగా నేనెప్పుడూ సేఫ్‌ జోన్‌లో ఉంటాను. అందుకే, వందకు పైగా చిత్రాలు తీశా. మరో వంద చిత్రాలు చేయగలిగే స్థాయిలో ఉన్నాను’’ అని తుమ్మలపల్లి రామసత్యనారాయణ అన్నారు. నరసింహ నంది దర్శకత్వంలో ఆయన నిర్మించిన చిత్రం ‘జాతీయ రహదారి’. తమ సినిమా ప్రేక్షకులతో పాటు విమర్శకుల మెప్పు పొందిందని చిత్రబృందం సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా భారత్‌ ఆర్ట్స్‌ అకాడెమీ, ఏబీసీ ఫౌండేషన్‌ ఏర్పాటు చేసిన అభినందన సభలో తమ్మారెడ్డి భరద్వాజ, యండమూరి వీరేంద్రనాథ్‌, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.