Sep 21 2021 @ 08:29AM

వెంకటేశ్‌తో ‘జాతిరత్నాలు’ దర్శకుడు..?

విక్టరీ వెంకటేశ్‌తో ‘జాతిరత్నాలు’ దర్శకుడు అనుదీప్ సినిమా చేయబోతున్నాడనే వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘జాతిరత్నాలు’ మూవీని అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కించి భారీ హిట్ ఇచ్చిన అనుదీప్ టాలీవుడ్‌లో క్రేజీ డైరెక్టర్‌గా మారాడు. దాంతో మరోసారి నాగ్ అశ్విన్ నిర్మాణంలో ఒక సినిమా అలాగే, ఇతర నిర్మాణ సంస్థలలో కూడా చిత్రాలను తెరకెక్కించే అవకాశాలు అందుకున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే కామెడీ ఎంటర్‌టైనర్ కథను వెంకీకి చెప్పగా, ఆయన కథ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి దీనికి సంబంధించిన అధికారక ప్రకటన ఎప్పుడు రానుందో చూడాలి. కాగా వెంకటేశ్ నటించిన 'దృశ్యం 2' త్వరలో విడుదల తేదీని ప్రకటించనున్నారు. అలాగే వరుణ్‌తేజ్‌తో చేస్తున్న మల్టీస్టారర్ 'ఎఫ్ 3' వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.