అమర జవానుకు ఘననివాళి

ABN , First Publish Date - 2021-08-01T13:31:31+05:30 IST

కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన అమరవీరునికి ఆయన స్వగ్రామంలో సైనిక లాంఛనాల నడుమ శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కన్నియ

అమర జవానుకు ఘననివాళి

పెరంబూర్‌(చెన్నై): కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తూ విద్యుదాఘాతానికి గురై మృతిచెందిన అమరవీరునికి ఆయన స్వగ్రామంలో సైనిక లాంఛనాల నడుమ శనివారం అంత్యక్రియలు నిర్వహించారు. కన్నియకుమారి జిల్లా కూట్రవిళాకం గ్రామానికి చెందిన స్టీఫెన్స్‌ (43) 2002వ సంవత్సరంలో భారత సరిహద్దు సైనిక దళంలో చేరారు. ఆయనకు సెర్లిన్‌మీనా అనే భార్య, ఇద్దరు పిల్లలున్నారు. కశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్న స్టీఫెన్‌ గత నెల 29వ తేదీ హఠాత్తుగా విద్యుదాఘాతానికి గురై సంఘటనాస్థలంలోనే మృతిచెందాడు. ఈ నేపథ్యంలో, స్టీఫెన్స్‌ భౌతిక కాయాన్ని శనివారం ప్రత్యేక విమానంలో తిరువనంతపురం తీసుకొచ్చి, అక్కడి నుంచి వాహనంలో స్వగ్రామానికి తరలించారు. స్టీఫెన్స్‌ పార్థివ దేహానికి సమాచార సాంకేతిక శాఖ మంత్రి మనోతంగరాజ్‌, సైనిక, పోలీసు అధికారులు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్టీఫెన్‌కు సొంతమైన తోటలో ఆయన భౌతికకాయాన్ని ఖననం చేశారు. తొలుత ఆయన మృతికి సంతాపంగా సైనికులు 24 రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు.

Updated Date - 2021-08-01T13:31:31+05:30 IST