Abn logo
Dec 3 2020 @ 17:05PM

కంగన రనౌత్‌పై పరువునష్టం కేసు.. కోర్టుకు హాజరైన జావేద్ అక్తర్

ముంబై: బాలీవుడ్ నటి కంగన రనౌత్‌పై వేసిన పరువునష్టం కేసులో ప్రముఖ గేయ రచయిత జావేద్ అక్తర్ నేడు అంధేరి మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా తన గుర్తింపు, ఫిర్యాదుకు సంబంధించిన వివరాలను కోర్టుకు చూపించారు. వెరిఫికేషన్ పూర్తికావడంతో ఈ కేసు తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. ఓ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో మాట్లాడిన కంగన.. జావేద్ అక్తర్ ప్రతిష్ఠకు భంగం కలిగేలా వ్యాఖ్యలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.


ఆ ఇంటర్వ్యూకు ఆన్‌లైన్ ప్లాట్‌ఫాటంలో లక్షలాది వీక్షణలు వచ్చాయని, నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సంబంధం లేకున్నా అనవసరంగా తన పేరును బయటకు లాగిందని ఆరోపిస్తూ అక్తర్ కోర్టుకెక్కారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఐపీసీ సెక్షన్ 499, 500 ప్రకారంపై ఆమెపై పరువునష్టం కేసు నమోదు చేయాలని అక్తర్ డిమాండ్ చేశారు. ఈ కేసులో వెరిఫికేషన్ పూర్తి కావడంతో ఈ నెల 19న తొలి విచారణ జరగనుంది. 


Advertisement
Advertisement
Advertisement