మన మోడల్‌ మనకుంది... బతిమాలుడేంది?

ABN , First Publish Date - 2021-05-14T08:58:32+05:30 IST

మన మోడల్‌ మనకు ఉన్నప్పుడు వ్యాక్సిన్‌ ఇప్పించాలని బతిమాలుకోవడం ఏమిటని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిపై మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ విసుర్లు విసిరారు. గురువారం ఆయన దీనిపై ట్వీట్‌ చేశారు

మన మోడల్‌ మనకుంది... బతిమాలుడేంది?

జగన్‌పై జవహర్‌ విసుర్లు

అమరావతి, మే 13(ఆంధ్రజ్యోతి): మన మోడల్‌ మనకు ఉన్నప్పుడు వ్యాక్సిన్‌ ఇప్పించాలని బతిమాలుకోవడం ఏమిటని ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డిపై మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ విసుర్లు విసిరారు. గురువారం ఆయన దీనిపై ట్వీట్‌ చేశారు. ‘‘మనం కన్నెర్ర చేస్తే గంగవరం, కృష్ణపట్నం పోర్టు ఓనర్లు వణుక్కొంటూ అయినకాడికి మనోడికి వాటిని అమ్మేసి పోయారు. మొండికేసిన సంగం డెయిరీ చైర్మన్‌ను రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో కూర్చోబెట్టాం. మాట వినకపోతే జువారీ సిమెంటు, అమర్‌ రాజా బ్యాటరీస్‌ కంపెనీలకు కాలుష్యం నోటీసు ఇచ్చి మూసేయించాం. వ్యాక్సిన్‌ కంపెనీవోడు ఇంతకన్నా మొనగాడా ఏంది? వ్యాక్సిన్లు ఇప్పించాలని చంద్రబాబును, రామోజీరావును మనం బతిమాలుకోవడం ఏందన్నా? సిగ్గు పోతోంది. మన మోడల్‌ మనకుందిగా’’ అని జవహర్‌ పేర్కొన్నారు. 

Updated Date - 2021-05-14T08:58:32+05:30 IST