Abn logo
Sep 21 2021 @ 01:32AM

జవానుకు సొంతూరులో ఘన సన్మానం

సామంతకుర్రులో జవాను కోలా విఘ్నేశ్వరరావు దంపతులను సన్మానిస్తున్న దృశ్యం

అల్లవరం, సెప్టెంబరు 20: భారత రక్షణ దళంలో జవానుగా విశిష్ట సేవలు అందించి పదవీ విరమణ పొందిన కోలా విఘ్నేశ్వర రావుకు స్వగ్రామమైన సా మంతకుర్రులో ఆదివారం ఘనంగా సన్మానించారు. భారత రక్షణ దళంలో తమ గ్రామానికి చెందిన విఘ్నేశ్వరరావు జవానుగా సేవలందించడం తమకు గర్వ కారణమని వక్తలు ప్రసంగించారు. సర్పంచ్‌ కొల్లు వెంకటరమణ, సొసైటీ ప్రెసిడెంట్‌ కొపనాతి వెంకటరాజు, కొప్పాడి వీరాంజనేయులు, కొప్పాడి నాగేశ్వరరావు, కోలా తాతరాజు, కె.గోపీరాజు, పాలెపు శ్రీను, లంకే తాతరాజు, కొపనాతి రవికుమార్‌, చింతా చిదంబరనాయకర్‌ పాల్గొన్నారు.