లాడ్జి బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడిన జవాన్.. బ్యాగులో కనిపించిన లేఖలో షాకింగ్ విషయాలు..!

ABN , First Publish Date - 2021-07-18T00:24:57+05:30 IST

అతడో జవాను. ప్రాణాలకు తెగించి ఎన్నోసార్లు పోరాటం చేశాడు. కానీ జీవిత పోరాటంలో ఓడిపోయి చివరకు తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. అది కూడా తన పుట్టిన రోజునే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు.

లాడ్జి బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడిన జవాన్.. బ్యాగులో కనిపించిన లేఖలో షాకింగ్ విషయాలు..!

ఇంటర్నెట్ డెస్క్: అతడో జవాను. ప్రాణాలకు తెగించి ఎన్నోసార్లు పోరాటం చేశాడు. కానీ జీవిత పోరాటంలో ఓడిపోయి చివరకు తన ప్రాణాలు తానే తీసుకున్నాడు. అది కూడా తన పుట్టిన రోజునే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అరవింద్ సింహ్ రాఠోర్ (35) అనే వ్యక్తి సీఆర్‌పీఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. ఉద్యోగంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్న అరవింద్.. ఈ నెల 13న లలిత్‌పూర్‌లోని ఒక లాడ్జికి వచ్చాడు. మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో వచ్చిన అతను.. ఒక గదిలో దిగాడు. మొదటి రోజు బాగానే ఉన్న అతను రెండో రోజు సాయంత్రం వరకూ గదిలో నుంచి బయటకు రాలేదు. దీంతో లాడ్జి మేనేజర్ వెళ్లి అతని గది తలుపు తట్టాడు.


ఎంతసేపు తలుపు తట్టినా అరవింద్ బయటకు రాకపోవడంతో.. లాడ్జి మేనేజర్‌కు అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లాడ్జికి వచ్చిన పోలీసులు.. అరవింద్ గది తలుపులు బద్దలు కొట్టి లోపలకు వెళ్లారు. అక్కడ అరవింద్ కనిపించలేదు. బాత్రూం తలుపులు కూడా వేసి ఉండటంతో వాటిని కూడా పగలగొట్టారు. అక్కడ ఉరికి వేలాడుతున్న అరవింద్ మృతదేహం కనిపించింది. అతని గదిని గాలించగా.. బ్యాగులో రెండు పేజీల సూసైడ్ నోట్ కనిపించింది. ‘‘పూర్తి స్పృహలో ఉండే ఈ సూసైడ్ నోట్ రాస్తున్నా. నేను చనిపోతానని కుటుంబానికి ఎప్పటి నుంచో చెప్తున్నా. నా చావుకు ఎవరూ బాధ్యతలు కాదు. నేను పోయిన తర్వాత నా ఉద్యోగాన్ని తమ్ముడు జీతూ సింహ్ లేదంటే కుమారుడు రోహిత్ రాఠోర్‌కు ఇవ్వండి. నేను 15-7-1986న పుట్టా. జూలై 15నే ఆత్మహత్య చేసుకుంటున్నా. 2020లో ఒక కంపెనీలో 12 లక్షలు పెట్టుబడి పెట్టా. అది మునిగిపోయింది. అప్పటి నుంచి నా మనసు ప్రశాంతంగా లేదు’’ అని అరవింద్ రాసుకొచ్చాడు. తాను చనిపోవడం తథ్యమని, తనపై కొందరు దేవతల ప్రభావం ఉందని, అందుకే ఈ విషయం తనకు ముందుగానే తెలిసిందని ఈ లేఖలో అతను పేర్కొన్నాడు. ఇది చదివిన పోలీసులు.. అరవింద్ ఈ నిర్ణయం సడెన్‌గా తీసుకోలేదని, చాలా ప్లానింగ్‌తోనే ఆత్మహత్య తీసుకున్నాడని భావిస్తున్నారు.

Updated Date - 2021-07-18T00:24:57+05:30 IST