కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీకి జే అండ్‌ జేతో

ABN , First Publish Date - 2020-08-14T07:31:32+05:30 IST

కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే అండ్‌ జే)కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ జాన్సెన్‌ ఫార్మాస్యుటికా ఎన్‌వీతో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ ఒప్పందం కుదుర్చుకుంది...

కొవిడ్‌ వ్యాక్సిన్‌ తయారీకి జే అండ్‌ జేతో

  • బయోలాజికల్‌ - ఈ ఒప్పందం


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ కోసం జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే అండ్‌ జే)కు చెందిన ఫార్మాస్యూటికల్‌ కంపెనీ జాన్సెన్‌ ఫార్మాస్యుటికా ఎన్‌వీతో హైదరాబాద్‌కు చెందిన బయోలాజికల్‌-ఈ ఒప్పందం కుదుర్చుకుంది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ అభివృద్ధి చేస్తున్న కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ ‘ఏడీ26.కొవి2.ఎస్‌’ ప్రస్తుతం మొదటి, రెండో దశ క్లినికల్‌ పరీక్షల్లో ఉంది. వ్యాక్సిన్‌ తయారీ సామర్థ్యాలను పెంచడానికి ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు బయోలాజికల్‌-ఈ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మహిమ దాట్ల తెలిపారు.


కొవిడ్‌ విశ్వవ్యాప్తంగా విస్తరిస్తున్నందున భారీ స్థాయిలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ను సరఫరా చేయాల్సి ఉంది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ వంటి కంపెనీతో ఒప్పందం కుదుర్చుకోవడం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో జాన్సన్‌ చేస్తున్న ప్రయత్నానికి బయోలాజికల్‌-ఈ తోడ్పడుతుందని, కంపెనీకి చెందిన తయారీ మౌలిక  సదుపాయాలను జాన్సన్‌ వ్యాక్సిన్‌ తయారీకి వినియోగిస్తామని చెప్పారు. 


బేలార్‌ కాలేజీతో: అందరికీ అందుబాటులో ఉండే కొవిడ్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడానికి బేలార్‌ కాలేజీ ఆఫ్‌ మెడిసిన్‌తో బయోలాజికల్‌-ఈ లైసెన్స్‌ ఒప్పందం కుదుర్చుకుంది. బేలార్‌లో ప్రాథమికంగా అభివృద్ధి చేసిన రికాంబినెంట్‌ ప్రోటీన్‌ వ్యాక్సిన్‌ అభివృద్ధికి బీఈ లైసెన్స్‌ పొందింది. 


Updated Date - 2020-08-14T07:31:32+05:30 IST