Apr 25 2021 @ 17:49PM

శ్రీదేవిని, నన్ను కలపాలని చాలా మంది ట్రై చేశారు: జయప్రద

జయప్రద, జయసుధ, జయచిత్ర.. ఒకప్పుడు తెలుగు చిత్రపరిశ్రమను ఏలిన జయత్రయం. అందంలోనూ, అభినయంలోనూ ఒకరితో ఒకరు పోటీ పడేవారు. వీళ్లలో జయప్రదకు ఆ రోజుల్లో ఫాలోయింగ్‌ ఎక్కువగా ఉండేది. తెలుగులో అగ్రహీరోలందరి సరసన నటించిన జయప్రద హిందీ ఫీల్డ్‌కు వెళ్లి అక్కడ కూడా అగ్రకథానాయికగా వెలిగారు. శ్రీదేవి హిందీ చిత్రరంగానికి పరిచయమయ్యేవరకూ అక్కడ ఆమె హవా కొనసాగింది. రీసెంట్‌గా జయసుధ, శ్రీదేవి గురించి జయప్రద ఓ సందర్భంలో చెప్పిన మాటలు ఇవి.


‘‘ఇండస్ట్రీలో నాకు జయసుధ చాలా క్లోజ్‌. తనతో ఉంటే ఫ్యామిలీతో ఉన్నట్టు ఉండేది. వాళ్లమ్మ జయసుధ కన్నా నన్నే బాగా చూసేది. శ్రీదేవి చాలా యారొగెంట్‌. ఆమెకు, నాకూ తెలియని దూరం ఉండేది. హెల్దీ కాంపిటిషన్‌ ఉండాల్సింది పోయి మా ఇద్దరి మధ్య ఎప్పుడూ ఏదో ఇబ్బందిగా ఉండేది. ఇద్దరం కలిసి చాలా పిక్చర్స్‌ చేశాం. చాలా ఇంటిమసీ ఉండేది ఆన్‌స్ర్కీన్‌లో. లైట్స్‌ ఆఫ్‌ కాగానే నా కుర్చీ అటూ, ఆ అమ్మాయి ఇటూ ఉండేది. అందరూ కలపాలని ట్రై చేశారు. మాకు మనస్పర్థలు ఏమీ లేవు. మా ఫ్రీక్వెన్సీ మ్యాచ్‌ కాలేదు అంతే. అయినా ఆ అమ్మాయంటే నాకెప్పుడూ ద్వేషం లేదు.’’ అని జయప్రద తెలిపింది.