మేడిగడ్డ బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,96,470 క్యూసెక్కులు

ABN , First Publish Date - 2021-09-14T16:33:13+05:30 IST

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 77 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

మేడిగడ్డ బ్యారేజ్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,96,470 క్యూసెక్కులు

జయశంకర్ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 77 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,96,470 క్యూసెక్కులుగా ఉంది.  బ్యారేజీ పూర్తి సామర్ధ్యం 16.17 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటిమట్టం 2.456 టీఎంసీలుగా ఉంది. అటు అన్నారం (సరస్వతీ) బ్యారేజీ వద్ద వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు 10 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో 32,128, ఔట్ ఫ్లో 22,500 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ పూర్తి సామర్ధ్యం10.87 టీఎంసీలకు గాను ప్రస్తుత నీటి మట్టం 5.42 టీఎంసీలుగా నమోదు అయ్యింది. 

Updated Date - 2021-09-14T16:33:13+05:30 IST