జయశంకర్‌ సార్‌ సేవలు సదా చిరస్మరణీయం

ABN , First Publish Date - 2020-08-07T05:34:00+05:30 IST

తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన సిద్ధాం తకర్త, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి

జయశంకర్‌ సార్‌ సేవలు సదా చిరస్మరణీయం

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 6 : తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాలలో కీలకపాత్ర పోషించిన సిద్ధాం తకర్త, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి దిశానిర్ధే శం చేసిన మహనీయుడు ప్రొఫెసర్‌ జయశం కర్‌ సార్‌ అని కలెక్టర్‌ భారతి హొళికేరి అన్నారు. గురు వారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసి న జయశంకర్‌ జయంతి కార్యక్రమానికి హాజరై ఆయ న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. రాష్ట్ర సాధన ఉద్యమంలో తెలంగాణ ప్రజ లకు దిశ,నిర్దేశం చేస్తూ ముందుకు నడిపించారన్నారు.  పరిపాలన అధికారి సురేష్‌, సిబ్బంది  పాల్గొన్నారు. 


మంచిర్యాల టౌన్‌: ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ నేటి నాయకులు, యువతకు ఆదర్శ ప్రాయుడని  ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు అన్నారు. జయశంకర్‌ జయం తిని అతిథిగృహం ఆవరణలో నిర్వహించగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పిం చారు. చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌చైర్మన్‌ ముకేష్‌ గౌడ్‌, గాదె సత్యం,  విజిత్‌కుమార్‌, చంద్రశేఖర్‌ హండే, తోట తిరుపతి,  పాల్గొన్నారు. 


మందమర్రిటౌన్‌: ఆచార్య జయశంకర్‌ ఆశయ సాధ న దిశగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని జడ్పీ చైర్‌ప ర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మీఓదెలు అన్నారు. గురువారం జయశంకర్‌ జయంతి సందర్భంగా  ఆయన చిత్రపటా నికి పూలమాల వేసి నివాళులర్పించారు. 


జన్నారం: తెలంగాణ రాష్ట్ర  ఏర్పాటుకు జయశంకర్‌ సార్‌ చేసిన కృషి మరువలేనిదని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. మండల కేంద్రంలోని  ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు.  టీఆర్‌టీయూ, లయన్స్‌క్లబ్‌, పొన్కల్‌ గ్రామపంచాయతీ తహసీల్దార్‌ కార్యాలయాల్లో నివాళులర్పిం చారు.  


బెల్లంపల్లి: ప్రొఫెసర్‌ జయశంకర్‌ సేవలు మరువ లేనివని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు.   క్యాంపు కార్యాలయంలో జయశంకర్‌ జయంతి పురస్క రించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


దండేపల్లి : ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు కృషి చేయాలని ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌ అన్నారు.   


జైపూర్‌: ఆయా గ్రామాల్లో, కార్యాలయాల్లో ప్రొఫెస ర్‌ జయశంకర్‌ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. తహసీల్దార్‌ ప్రసాద్‌ వర్మా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. 


భీమిని: ఎంపీడీవో కార్యాలయంలో ఆచార్య జయ శంకర్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో రాధాకృష్ణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  


వేమనపల్లి:  ప్రొఫెసర్‌ జయశంకర్‌ జయంతి పుర స్కరించుకొని ఎంపీడీవో లక్ష్మీనారాయణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  


తాండూర్‌(బెల్లంపల్లి): మండల పరిషత్‌ కార్యాల యంలో జయశంకర్‌ జయంతి వేడుకలను ఘనంగా ని ర్వహించారు. ఎంపీపీ పూసాల ప్రణయ్‌కుమార్‌, ఎంపీ వో అక్తర్‌ మోహినోద్దీన్‌ నివాళులర్పించారు. 


కాసిపేట:  ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ రొడ్డ లక్ష్మీ జయశంకర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు.  


మందమర్రిరూరల్‌: ఎంపీడీవో కార్యాలయంలో ప్రొ ఫెసర్‌ జయశంకర్‌ జయంతిని నిర్వహించారు. జడ్పీ టీసీరవి, ఎంపీడీవోప్రవీణ్‌కుమార్‌  నివాళులర్పించారు.  


హాజీపూర్‌: దొనబండలో వైస్‌ ఎంపీపీ బేతు రమా దేవితోపాటు సర్పంచ్‌ జాడి సత్యం జయశంకర్‌ విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.   


నస్పూర్‌: టీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద  ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ జయంతి వేడుకలను నిర్వహించారు.  


భీమారం: ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ తిరుమల, సర్పంచు గద్దె రాంరెడ్డి, తహసీల్దార్‌ విజ యానందం జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  


లక్షెట్టిపేట: మున్సిపా లిటీ కార్యాలయంలో జనగణమన స్టీరింగ్‌ కమిటీ జయశంకర్‌ సార్‌ జయంతి నిర్వహించారు. ఎమ్మెల్యే దివాకర్‌రావు, డీసీఎం ఎస్‌ చైర్మన్‌ తిప్పని లింగయ్య, చైర్మన్‌ నల్మాసు కాంతయ్య, శ్రీనివాస్‌,  పాల్గొన్నారు. 


ఏసీసీ: ప్రొఫెసర్‌ జయశంక ర్‌ సార్‌ జయంతిని పురస్కరిం చుకొని తెలంగాణ నాన్‌ గెజి టెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీహరి ఆధ్వ ర్యంలో టీఎన్‌జీవోస్‌లో నిర్వ హించారు. జూనియర్‌ కళాశా లలో జయశంకర్‌ సార్‌  చిత్రపటానికి  పూలమాలలు వేసి నివాళులర్పించారు. 


రామకృష్ణాపూర్‌ : జయశం కర్‌ సార్‌ విగ్రహానికి పూలమా లలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  


చెన్నూర్‌: ఆచార్య ప్రొఫెసర్‌ జయశంకర్‌ సారు  తుది శ్వాస వరకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసిన గొప్ప మహనీయుడని మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నవాజోద్దీన్‌ అన్నా రు.

Updated Date - 2020-08-07T05:34:00+05:30 IST