ఆచార్య దేవోభవ

ABN , First Publish Date - 2021-06-22T04:51:42+05:30 IST

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతిని సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు.

ఆచార్య దేవోభవ
దమ్మపేటలో జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు

జిల్లా వ్యాప్తంగా తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్‌ వర్ధంతి

పార్టీలు, పలు సంఘాల ఆధ్వర్యంలో నివాళులు

ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు పిలుపు

మణుగూరు/ అన్నపురెడ్డిపల్లి/ చంద్రుగొండ/ బూర్గంపాడు/ దమ్మపేట/ కొత్తగూడెం టౌన్‌ / ఇల్లెందు టౌన్‌, జూన్‌ 20: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతిని సోమవారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించారు. పలు పార్టీలు, సంఘాలు, అధికారులు జయశంకర్‌సార్‌ చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన ఆయనను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

మణుగూరు టీఆర్‌ఎస్‌ నాయకుల ఆధ్వర్యంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతి కార్యక్రమాన్ని సోమవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వరాష్ట్ర పోరాటానికి స్ఫూర్తినిచ్చిన జయశంకర్‌ సేవలు మరవలేనివన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ విజయకుమారి, సొసైటీ ఛైర్మన్‌ కుర్రి నాగేశ్వరరావు, నాయకులు ముత్యం బాబు, అడపా అప్పారావు, రంజిత్‌, ముద్దంగుల కృష్ణ, బాబ్‌జాన్‌, హరిప్రసాద్‌ పాల్గొన్నారు. 

జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా కూనవరం బాంబే కాలనీ సెంటర్‌ టీఆర్‌ఎస్‌ నాయకులు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో గుడిపూడి కొటేశ్వరరావు, టీబీజీకేస్‌ నాయకులు కోటా శ్రీనివాస్‌, సకిని బాబూరావు, హబీబ్‌, పాషా, సుధాకర్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్‌ వర్థంతిని అశ్వారావుపేట మండలంలో సోమవారం నిర్వహించారు. అశ్వారావుపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలోని జయశంకర్‌ విగ్రహానికి సీఐ ఉపేందరరావు, ఉద్యమ నాయకులు ముబారక్‌బాబాతో పాటు పలువురు టీఆర్‌ఎస్‌ నాయకులు, అభిమానులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మండల పరిషత్తు కార్యాలయంలో జరిగిన వేడుకల్లో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తి, ఎంపీడీవో పి.విజయ, అధికారులు నివాళులు అర్పించారు.  అలాగే అశ్వారావుపేట, పేరాయిగూడెంతో పాటు అనేక గ్రామపంచాయతీల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో వర్ధంతి నిర్వహించారు. 

రాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్‌ వర్ధంతి సందర్భంగా జడ్పీపాఠశాలలోని ప్రొఫెసర్‌ జయశంకర్‌ విగ్రహానికి అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా మాట్లాడుతు రాష్ట్ర ఏర్పాటుకు జయశంకర్‌ ఎంతో కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో దొడ్డాకుల రజేశ్వరరావు, వైస్‌ ఎంపీపీ ధారా మల్లికార్జునరావు, సొసైటీ చైర్మన్‌ రావు జోగేశ్వరరావు, ఆత్మాకమిటీ చైర్మన్‌ కేవి సత్యనారాయణ, మార్కెట్‌కమిటీ ఉపాధ్యాక్షుడు కొయ్యల అచ్యుతరావు, సర్పంచ్‌ వెంకటేశ్వరరావు, ఉపసర్పంచ్‌ దారా యుగంధర్‌, దొడ్డా రమేష్‌, భరత్‌కుమార్‌, పోతినేని శ్రీరామ వెంకట్రావు, యార్లగడ్డ బాబు, రాయల నాగేశ్వరరావు, బొల్లికొండ ప్రభాకర్‌, నాపెడ్‌ పీల్డ్‌ ఆఫీసర్‌ విజయలక్ష్మి, తులసి పాల్గొన్నారు.

రాష్ట్ర సిద్ధాంతకర్త జయశంకర్‌ వర్ధంతిని సోమవారం చంద్రుగొండలో నిర్వహించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో జయశంకర్‌ చిత్రపటానికి ఎంపీపీ పార్వతి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర సాదనలో జయశంకర్‌ చేసిన సేవలను కోనియాడారు. ఈ కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ సత్యనారాయణ, జిల్లా కో-ఆప్షన్‌ సభ్యులు రసూల్‌, టీఆర్‌ఎస్‌ పార్టీ మండలాధ్యక్షుడు భోజ్యానాయక్‌ పాల్గొన్నారు.

రాష్ట్ర సిద్ధాంత కర్త ప్రొపెసర్‌ జయశంకర్‌ సార్‌ వర్ధంతి సందర్భంగా సోమవారం బూ ర్గంపాడు మండల పరిషత్‌ కార్యలయంలో ఆయనకు నివాళలర్పించారు. జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత జయశంకర్‌ విగ్రహనికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలను కొనియాడారు.. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పొడియం ముత్యాలమ్మ, ఎంపీడీవో వివేక్‌రామ్‌, ఏపీవో శ్రీలక్ష్మీ, ఏఈ వెంకటేశ్వరరావు, సిబ్బంది విజయలక్ష్మీ, ప్రసాద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు రమణారెడ్డి, నరేందర్‌ పాల్గొన్నారు.

జయశంకర్‌ వర్ధంతిని పురస్కరించుకుని ఫీడ్‌ ద నీడ్‌ స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. దమ్మపేట మండల పరిదిలోని మొండివర్రె, శ్రీరాంపురంలలో కొవిడ్‌ బారిన పడిన 25కుటుంబాలకు సోమవారం నిత్యావసర వస్తువులు, కోడిగుడ్లు పంపిణీ చేసారు.ఈసందర్భంగా సంస్ధ చైర్మన్‌ గారపాటి సూర్యనారాయణ అనురాధ దంపతులు మాట్లాడుతు కరోనా కష్ట కాలంలొ పేదలకు అండగా ఉండేందుకు సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. ఈకార్యక్రమంలో జారే ఆదినారాయణ, సర్పంచ్‌ రేణుక, కార్యదర్శులు నాగమణి, కృష్ణ ఎంపీటిసి శివ, సాయిల నర్సింహారావు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర సాధనకు అలుపెరగని పోరాటం చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సార్‌ స్ఫూర్తితో ముందుకు సాగాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కాపు సీతాలక్ష్మి అన్నారు. సోమవారం మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ నివాసంలో జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలలేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో టీబీజీకేఎస్‌ లెవెన్‌మెన్‌ కమిటీ సభ్యుడు కాపు కృష్ణ,  సెంట్రల్‌ కమిటీ సభ్యుడు సూరిబాబు, సత్యనారాయణ, రెడ్డి, అన్వర్‌ పాల్గొన్నారు. 

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్‌ జయశంకర్‌ వర్ధంతిని సోమవారం పట్టణంలోని వివిధ ప్రాంతాలలో నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే హరిప్రియ, ము నిసిపల్‌ చైర్మన్‌ దమ్మాలపాటి వెంకటేశ్వర్‌రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు పరుచూరి వెం కటేశ్వర్‌రావు జయశంకర్‌ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అదేవిధంగా  పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జయశంకర్‌ వర్ధంతిని అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది నిర్వహించారు. జయశంకర్‌ చిత్రపటానికి పూలమాలాలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ పోలారపు పద్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-22T04:51:42+05:30 IST