Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 14 2022 @ 20:43PM

జయేందర్‌ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత

చింతపల్లి: నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలోని విరాట్‌నగర్‌ శ్రీమెట్టు మహంకాళి దేవాలయం వద్ద లభ్యమైన మొండెం లేని తల ఘటనలో జయేందర్‌నాయక్‌ మృతదేహానికి శుక్రవారం హైదరాబాద్‌ ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ నెల 10వ తేదీన మహంకాళి దేవాలయంలో మాత విగ్రహం వద్ద మొండెం లేని తల ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీంతో నల్లగొండ జిల్లా పోలీసులు తొమ్మిది బృందాలుగా మొండెం కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్‌లో నిర్మాణంలో ఉన్న మూడు అంతస్తుల భవనంలో జయేందర్‌ మొండేన్ని స్వాధీనం చేసుకున్నారు. తలకు ఈ నెల 10వ తేదీన దేవరకొండ సివిల్‌ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించగా, మెండేనికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాన్ని జయందర్‌నాయక్‌ తండ్రి శంకర్‌నాయక్‌కు అప్పగించారు. ఆ మృతదేహం జయందర్‌నాయక్‌దేనా అనే నిర్ధారణ కోసం కుటుంబ సభ్యుల నుంచి రక్తనమునాలు సేకరించి డీఎన్‌ఏ పరీక్షలకు పంపించారు.

Advertisement
Advertisement