25నే ఇళ్ల పట్టాలు పంపిణీ : జేసీ

ABN , First Publish Date - 2020-12-04T06:01:06+05:30 IST

కోర్టు కేసులు, అనర్హులను మినహాయించి మిగిలిన వారికి డిసెంబరు 25న పట్టాలు అందజేసేందుకు సిద్ధంగా ఉండాలని జేసీ కె.వెంకట రమ ణారెడ్డి తహసీల్దార్లును ఆదేశించారు.

25నే ఇళ్ల పట్టాలు పంపిణీ : జేసీ
వీడియో కాన్ఫరెన్స్‌లో సమీక్షిస్తున్న జేసీ

ఏలూరు సిటీ, డిసెంబరు 3: కోర్టు కేసులు, అనర్హులను మినహాయించి మిగిలిన వారికి  డిసెంబరు 25న పట్టాలు అందజేసేందుకు సిద్ధంగా ఉండాలని జేసీ కె.వెంకట రమ ణారెడ్డి తహసీల్దార్లును ఆదేశించారు. కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలు నుంచి గురువారం జిల్లా జాయింట్‌ కలెక్టర్‌(రెవెన్యూ) కె.వెంకటరమణారెడ్డి జల్లాలోని ఆర్‌డీవో లు, తహసీల్దార్లతో ఇళ్లపట్టాలు, భూరికార్డులు స్వచ్ఛీకరణ అంశాలపై సమీక్షించారు. ఇళ్ళ పట్టాల మంజూరుకు ఇంకా చేయవలసిన భూసేకరణతోపాటు, లేఅవుట్లను నూరు శాతం సిద్ధం చేయాలన్నారు. కోర్టు కేసులకు సంబంఽధించి 8,550, అనర్హతగా తేలిన సుమారు 10 వేలు మినహా మిగి లిన లబ్ధిదారులందరికీ డిసెంబరు 25నే పట్టాలు అంద జేయాలన్నారు. ఇప్పటికే సిద్ధమైన అర్హుల జాబితాలో ఎవ రైనా మరణించి ఉంటే వారికి సంబంఽధించిన పట్టా వారి కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు ఎవరి పేరున మా ర్పు చేయాలో లిఖిత పూర్వక దరఖాస్తుతోపాటు, మరణ ధ్రువీకరణ, కుటుంబ ధ్రువీకరణ పత్రాలను జతచేసి తీసుకోవాలన్నారు. డీఆర్‌వో శ్రీనివాసమూర్తి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T06:01:06+05:30 IST