ఆక్సిజన్‌ సరఫరాలో అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-05-18T06:17:51+05:30 IST

కొవిడ్‌ రోగులకు ప్రాణవాయువు సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు.

ఆక్సిజన్‌ సరఫరాలో అప్రమత్తంగా ఉండాలి
ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలిస్తున్న జేసీ దినేష్‌కుమార్‌ తదితరులు

గుంటూరు(మెడికల్‌), మే 17: కొవిడ్‌ రోగులకు ప్రాణవాయువు సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జేసీ దినేష్‌కుమార్‌ తెలిపారు. సోమవారం జీజీహెచ్‌లోని నాట్కో కేన్సర్‌ సెంటర్‌లో వివిధ శాఖాధిపతులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు ఆక్సిజన్‌ అందించడంలో శ్రద్ధచూపడంతో పాటు వృఽథా కాకుండా చూడాలన్నారు. ఆక్సిజన్‌ను ఆదా చేసే స్టాఫ్‌ నర్సులకు, ఎంఎన్‌వోలకు ప్రోత్సాహకాలు అందిస్తామ తెలిపారు.    వెంటిలేటర్ల వాడకంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని తెలిపారు. అనంతరం ఆసుపత్రి ఆవరణలోని ఆక్సిజన్‌ ప్లాంట్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్‌ డాక్టర్‌ నీలం ప్రభావతి, నోడల్‌ అధికారి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-18T06:17:51+05:30 IST