అవకతవకలకు పాల్పడితే సహించేది లేదు

ABN , First Publish Date - 2020-05-24T08:34:02+05:30 IST

రేషన్‌ డిపోల్లో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని జేసీ కిశోర్‌కుమార్‌ హెచ్చరించారు.

అవకతవకలకు పాల్పడితే సహించేది లేదు

జేసీ కిశోర్‌కుమార్‌ 


గజపతినగరం, మే 23: రేషన్‌ డిపోల్లో అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని జేసీ కిశోర్‌కుమార్‌ హెచ్చరించారు. శనివారం మండలంలోని కొనిస, కొత్తబగ్గాం గ్రామాల్లోని చౌక దుకాణాలను ఆయన శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యావసరాల సరఫరాలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న కార్డుదారులు ఆయా ప్రాంతాల్లో సరుకులు తీసుకుంటున్నారా? లేదా? అని ప్రశ్నించారు. కార్డుదారులు మృతి చెందినా, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాలు అందజేయాలని సూచించారు. కొనిస డిపోకు సంబంధించి 8మంది కార్డుదారులకు సరుకులు అందనట్టుగా గుర్తించారు. వాటిపై నివేదిక అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ ఎం.అరుణకుమారి, సీఎస్‌డీటీ రవిశంకర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-05-24T08:34:02+05:30 IST