నాణ్యమైన ఎరువులు, విత్తనాలివ్వండి : జేసీ

ABN , First Publish Date - 2021-09-29T04:55:14+05:30 IST

రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని జాయింట్‌ కలెక్టర్‌ హరేందిరప్రసాద్‌ డీలర్లకు సూచించారు.

నాణ్యమైన ఎరువులు, విత్తనాలివ్వండి : జేసీ
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ హరేందిరప్రసాద్‌

నెల్లూరు(వ్యవసాయం), సెప్టెంబరు 28 : రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు  నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలని జాయింట్‌ కలెక్టర్‌ హరేందిరప్రసాద్‌ డీలర్లకు సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లాలోని ఎరువులు, విత్తనాల హోల్‌సేల్‌ డీలర్లు, ప్రాసెసింగ్‌ యూనిట్‌ ప్రతినిధులు, వ్యవసాయశాఖ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఎమ్మార్పీ కంటే అధిక ధరకు విక్రయాలు జరిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిం చారు. నాణ్యమైన విత్తనాలను రైతు భరోసా కేంద్రాల్లో ఉంచాలని విత్తన కంపెనీదారులను ఆదేశించారు. సన్నరకాలైన బీపీటీ-5204, ఎన్‌ఎల్‌ఆర్‌-34449, ఆర్‌ఎన్‌ఆర్‌-15048, ఎన్‌ఎల్‌ఆర్‌-3354, జేజీఎల్‌-384 వంటి రకాలను ప్రోత్సహించి రైతులు సాగుచేసేలా చూడాలని, ఎంటీయూ-1010 రకాన్ని రైతులు సాగుచేయకుండా అవగాహన కల్పించాలన్నారు. వ్యవసాయశాఖ జేడీ వై ఆనందకుమారి మాట్లాడుతూ నాణ్యత లేని విత్తనాలు, ఎరువులు కలిగి ఉన్న వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో వ్యవసాయశాఖ డీడీ ప్రసాదరావు, ఏడీ ధనుంజయరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-29T04:55:14+05:30 IST