Abn logo
Aug 7 2020 @ 20:34PM

అనంత నుంచి గుత్తికి జేసీ ప్రభాకర్ తరలింపు

అనంతపురం : టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. విడుదలైన 24 గంటల్లోపే వారిద్దర్నీ అరెస్ట్ చేయడంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. అరెస్ట్ అనంరతం జేసీ ప్రభాకర్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అనంతపురం నుంచి గుత్తికి జేసీని తరలించారు. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపచనున్నారు.


కాగా.. జేసీ ప్రభాకర్‌రెడ్డిపై శుక్రవారం నాడు అట్రాసిటీ కేసు నమోదయ్యింది. ఏకంగా ప్రభాకర్‌రెడ్డిపై సీఐ దేవేంద్రకుమార్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన విషయం తెలిసిందే. తాడిపత్రి రూరల్ పరిధిలోని బొందలదిన్నె వద్ద కడప నుంచి వస్తున్న ప్రభాకర్‌రెడ్డి వాహనాలను సీఐ దేవేంద్రకుమార్ అడ్డుకోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో కేసు నమోదు చేయడం జరిగింది.

Advertisement
Advertisement
Advertisement