నోడల్‌ ఆఫీసర్లు కొవిడ్‌ ఆస్పత్రుల విధులకు గైర్హాజరు కారాదు

ABN , First Publish Date - 2021-05-12T06:20:46+05:30 IST

కొవిడ్‌-19 ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లకు నోడల్‌ అధికారులుగా నియమించిన వారెవ్వరూ విధులకు గైర్హాజరు కారాదని జాయింట్‌ కలెక్టర్‌(సచివాలయాలు) పీ ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.

నోడల్‌ ఆఫీసర్లు కొవిడ్‌ ఆస్పత్రుల విధులకు గైర్హాజరు కారాదు

గుంటూరు, మే 11 (ఆంధ్రజ్యోతి): కొవిడ్‌-19 ఆస్పత్రులు, కేర్‌ సెంటర్లకు నోడల్‌ అధికారులుగా నియమించిన వారెవ్వరూ విధులకు గైర్హాజరు కారాదని జాయింట్‌ కలెక్టర్‌(సచివాలయాలు) పీ ప్రశాంతి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.  కలెక్టర్‌ అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైతే చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు. అలానే జిల్లా పరిపాలన యంత్రాంగానికి నిరంతరం అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ఎవరైతే సెలవు పెట్టారో వారంతా తిరిగి విధులకు హాజరు కావాలని ఆదేశించారు. అలానే ట్రైఏజింగ్‌, పడకల లభ్యత, పారిశుధ్యం, ఆహార నాణ్యత తదితర పనులను పర్యవేక్షించాలన్నారు. కొంతమంది సక్రమంగా విధులు నిర్వహించకపోవడం వల్ల కొవిడ్‌ నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. ఈ దృష్ట్యా నోడల్‌ అధికారులంతా బుధవారం నుంచి ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్ల డ్యూటీలకు హాజరు కావాలన్నారు.


Updated Date - 2021-05-12T06:20:46+05:30 IST