ఖరీఫ్‌ సీజన్‌లో ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు

ABN , First Publish Date - 2021-10-24T07:02:00+05:30 IST

రైతు శ్రమకు తగిన ఫలితం దక్కాలనే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రధానంగా రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే) ద్వారా జరిగేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని, ఈ విధానంపై అవగాహన పెంపొందించుకుని పటిష్ట సమన్వయంతో కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ ఆదేశించారు.

ఖరీఫ్‌ సీజన్‌లో ఆర్‌బీకేల ద్వారా ధాన్యం కొనుగోలు
సమావేశంలో మాట్లాడుతున్న జేసీ లక్ష్మీశ

  • జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ 

కాకినాడ సిటీ, అక్టోబరు 23: రైతు శ్రమకు తగిన ఫలితం దక్కాలనే ప్రధాన లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2021-22 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియ ప్రధానంగా రైతు భరోసా కేంద్రాల(ఆర్‌బీకే) ద్వారా జరిగేలా కొత్త విధానాన్ని తీసుకొచ్చిందని, ఈ విధానంపై అవగాహన పెంపొందించుకుని పటిష్ట సమన్వయంతో కొనుగోలు సక్రమంగా జరిగేలా చూడాలని జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ ఆదేశించారు. ధాన్యం సేకరణపై కలెక్టరేట్‌ కోర్టు హాల్‌లో రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ ప్రతినిధులు, సమన్వయ శాఖల అధికారులతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. దీనికి వర్చువల్‌గా సబ్‌ కలెక్టర్లు, ఆర్‌డీవోలు హాజరయ్యారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ఆర్‌బీకేల ద్వారా ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు సేకరిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియను విజయవంతం చేసి రైతులకు మేలు చేయడంలో మిల్లర్లు సహకరించాలని కోరారు. ఽధాన్యం నాణ్యతను తనిఖీ చేసేందుకు టెక్నికల్‌ అసిస్టెంట్లను నియమించాలని సూచించారు. రాష్ట్ర, జిల్లా రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షుడు ద్వారంపూడి వీరభద్రారెడ్డి మాట్లాడుతూ రైతు శ్రేయస్సు లక్ష్యంగా ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా సహాయ సహకారాలు అందించనున్నామన్నారు. సమావేశంలో సివిల్‌ సప్లయ్సి కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ ఇ.లక్ష్మీరెడ్డి, అగ్రికల్చర్‌ జేడీ ఎన్‌ .విజయ్‌కుమార్‌, లీగల్‌ మెట్రాలజీ డీసీ ఎంఎన్‌ఎస్‌ మాధురి, రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ ఎ.మోహన్‌, డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీరమణి, మార్కెటింగ్‌ ఏడీ కె.సూర్యప్రకాశరెడ్డి, రైస్‌ మిల్లర్ల తరఫున వేగుళ్ల పట్టాభిరామయ్యచౌదరి, సత్తి రామారెడ్డి, బులి మోహనరెడ్డి, సూర్యప్రకాశరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T07:02:00+05:30 IST