ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దు

ABN , First Publish Date - 2021-05-18T06:49:25+05:30 IST

రైతులు రబీ సీజన్లో పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోద్దని, రైతు భరోసా కేంద్రాలు, ఽధాన్యం సేకరణ కేంద్రాలను సంప్రదించి ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర పొందాలని జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ కోరారు.

ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోవద్దు

  • జాయింట్‌ కలెక్టర్‌ లక్ష్మీశ

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), మే 17: రైతులు రబీ సీజన్లో పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించి మోసపోద్దని, రైతు భరోసా కేంద్రాలు, ఽధాన్యం సేకరణ కేంద్రాలను సంప్రదించి ప్రభుత్వం ప్రకటించిన మద్ధతు ధర పొందాలని జాయింట్‌ కలెక్టర్‌ జి.లక్ష్మీశ కోరారు. సోమవారం సాయంత్రం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో రబీ ఽధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు చేపట్టిన చర్యలను ఆయన వివరించారు. జిల్లాలో ఇప్పటివరకు 355 ధాన్యం సేకరణ కేంద్రాల ద్వారా 2.14 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామ న్నారు. జిల్లాలోని 885 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం తేమ శాతం కొలిచే యంత్రాలను అందుబాటులో ఉంచా మన్నారు. జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ఽధాన్యం తడవకుండా బరకాలను కప్పి కాపాడుకోవాలన్నారు. ధాన్యం సేకరణకు సంబంధించి రైతులకు ఎటువంటి సమస్యలు ఎదురైనా తక్షణం పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో 88866 13611 నెంబరుతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. మద్దతు ధర పొందడంలో దళారులు, ఇతరుల నుంచి సమస్యలు ఎదురైతే ఈ నెంబరుకు ఫోను చేసి సహాయం పొందవచ్చని జేసీ చెప్పారు.

Updated Date - 2021-05-18T06:49:25+05:30 IST