నాసిరకం పనులపై జేసీ సిరి ఆగ్రహం

ABN , First Publish Date - 2021-07-29T06:28:57+05:30 IST

నాడు-నేడు పనుల్లో నెలకొన్న పనుల్లో నాణ్యతా లోపంపై జాయింట్‌ కలెక్టర్‌ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అసిస్టెంట్‌ ఇంజనీరును వెంటనే మెమో ఇవ్వాలంటూ కమిషనర్‌ను ఆదేశిం చింది. జేసీ సిరి బుధవారం గుంతకల్లు పట్టణం లోని రాజేంద్రప్రసాద్‌ మున్సిపల్‌ ప్రైమరీ స్కూల్‌ను, హైస్కూళ్లలో జరిగిన నాడు-నేడు పనులను పరిశీలించారు.

నాసిరకం పనులపై జేసీ సిరి ఆగ్రహం
గుంతకల్లులో తరగతి గదులను పరిశీలిస్తున్న జేసీ సిరి

ఏఈకి మెమో ఇవ్వాలంటూ కమిషనర్‌కు ఆదేశం

గుంతకల్లుటౌన్‌, జూలై 28 : నాడు-నేడు పనుల్లో నెలకొన్న పనుల్లో నాణ్యతా లోపంపై జాయింట్‌ కలెక్టర్‌ సిరి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంబంధిత అసిస్టెంట్‌ ఇంజనీరును వెంటనే మెమో ఇవ్వాలంటూ కమిషనర్‌ను ఆదేశిం చింది. జేసీ సిరి బుధవారం గుంతకల్లు పట్టణం లోని రాజేంద్రప్రసాద్‌ మున్సిపల్‌ ప్రైమరీ స్కూల్‌ను, హైస్కూళ్లలో జరిగిన నాడు-నేడు పనులను పరిశీలించారు. నాసిరకం పనులపై  సచివాలయం ఎమినిటీస్‌ సెక్రెట రీని, మున్సిపల్‌ అసిస్టెంట్‌ ఇంజనీరును మందలించారు.  సంబంధిత ఏఈకి మెమో ఇవ్వాలంటూ గుంత కల్లు మున్సిపల్‌ కమిషనర్‌ను ఆదేశించారు. రాజేంద్రప్రసాద్‌ ప్రైమరీ స్కూల్‌లో పెయిం టింగ్‌ నాణ్యతగా చేయలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. మళ్లీ రీ పెయింటింగ్‌ వేయా లంటూ ఆదేశించారు. పనుల్లో నాణ్యత లోపి స్తే... ఊపేక్షించేది లేదంటూ అధికారులను హెచ్చరించారు. అనంతరం అర్బన్‌ హెల్త్‌ సెంటరులో వైద్యుడు స్టెతస్కోపు లేకుండా ఉండటంపై మండిపడ్డారు.  ఆ  వైద్యుడికీ మె మో ఇవ్వాలని కమిషనర్‌కు సూచించారు. ఆమె వెంట  సమగ్రశిక్ష ఏపీసీ తిలక్‌, నియోజకవర్గ ప్రత్యేక అధికారి శ్రీనివాసులు, మున్సిపల్‌ కమిషనరు బండి శేషన్న, తహసీల్దారు రాము, ఎంపీడీఓ సూర్యనారాయణ ఉన్నారు.

 

Updated Date - 2021-07-29T06:28:57+05:30 IST