పారిశుధ్య పనులు వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2020-12-04T05:43:51+05:30 IST

బుగ్గవంక నీళ్లు ముంచెత్తడంతో కష్టాలుపడుతున్న బాధితుల వ్యథలను గురువారం ‘బతుకు బుగ్గపాలు’ పేరిట ఆంరఽధజ్యోతిలో కథనం ప్రచురితమైంది. ప్రజలు పడుతున్న కష్టాలను వెలుగులోకి తెచ్చింది.

పారిశుధ్య పనులు వేగవంతం చేయండి
వరద బాధితులను ఓదారుస్తున్న జేసీ సాయికాంత వర్మ

జేసీ సాయికాంతవర్మ

కడప, డిసెంబరు 3 (ఆంరఽధజ్యోతి): బుగ్గవంక పరివాహక ప్రాంతాల్లో వరద కారణంగా ప్రత్యేక పారిశుధ్య పనులను వేగవంతం చేయాలని జేసీ సాయికాంతవర్మ ఆదేశించారు. బుగ్గవంక నీళ్లు ముంచెత్తడంతో కష్టాలుపడుతున్న బాధితుల వ్యథలను గురువారం ‘బతుకు బుగ్గపాలు’ పేరిట ఆంరఽధజ్యోతిలో కథనం ప్రచురితమైంది. ప్రజలు పడుతున్న కష్టాలను వెలుగులోకి తెచ్చింది. స్పందించిన జేసీ సాయికాంతవర్మ వరద ప్రాంతాలైన నాగరాజుపేట, రహ్మతుల్లావీధి, కైలా్‌సప్రింటింగ్‌ ప్రెస్‌, రవీంద్రనగర్‌ ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ జరుగుతున్న పారిశుధ్య పనులపై అధికారులను ఆరా తీశారు. నివర్‌ తుఫాను కారణంగా బుగ్గవంకకు ఇరువైపులా ఉన్న పలు కాలనీల్లోకి నీరు రావడంతో జలమయమై పెద్ద ఎత్తున బురద పేరుకుంది. కలెక్టరు ఆదేశాల మేరకు మున్సిపల్‌ కమిషనరు ఆధ్వర్యంలో మూడురోజుల నుంచి ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి బురదను తీస్తున్నామని అధికారులు తెలిపారు. అదనంగా సిబ్బందిని ఉపయోగించుకుని పగలు రాత్రి తేడా లేకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని జేసీ ఆదేశించారు. తాను ఆకస్మికంగా రాత్రుళ్లలో తనిఖీ చేస్తానని అన్నారు. బురద తొలగించిన వెంటనే అంటువ్యాధులు ప్రబలకుండా బ్లీచింగ్‌, సున్నం స్ర్పే చేయాలన్నారు. నాగరాజుపేటకు చెందిన పాలగిరి చరిత తన కూతురి పెళ్లికోసం ఇంట్లో పెట్టిన రూ.70వేల నగదు, ఐదు తులాల బంగారు, పెళ్లి సామగ్రి వరద నీటిలో కొట్టుకుపోయాయి. ఇల్లు కూడా దెబ్బతింది. ఈ వివరాలన్నీ తెలిపి విలపించిన చరితను జేసీ సాయికాంతవర్మ ఓదార్చారు. ఈ కార్యక్రమంలో జేసీ వెంట అడిషనల్‌ మున్సిపల్‌ కమిషనరు సుబ్బారావు, డిప్యూటీ కమిషనరు శివారెడ్డి, ఈఈ ధనలక్ష్మి, డీఈ రాజేష్‌, కరీముల్లా, శానిటేషన ఇనస్పెక్టర్లు లక్ష్మినారాయణ, నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T05:43:51+05:30 IST