Abn logo
Sep 24 2021 @ 00:46AM

జేసీపీఆర్‌ ‘ఆత్మీయ పలకరింపు’

టీడీపీ నేతలతో మాట్లాడుతున్న జేసీ ప్రభాకరరెడ్డి

అనంతపురం వైద్యం, సెప్టెంబరు 23: తా డిపత్రి మున్సిపల్‌ చై ర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి జిల్లా కేంద్రంలోని ప లువురు టీడీపీ నాయ కుల ఇళ్ల వద్దకు వెళ్లి వారిని ఆత్మీయంగా పలకరిస్తున్నారు. ఆత్మీ య పలకరింపు పేరు తో ఆయన నాలుగు రోజులుగా నేతల ఇళ్లకు వెళ్తున్నారు. ఆయన గురువారం 40వ డివిజన మాజీ కార్పొరేటర్‌ సుజాతమ్మ, ఆమె భర్త టీడీపీ నేత గంగాధర్‌ ఇంటికి వెళ్లి పలకరించారు. అలాగే నాయకులు లక్ష్మీనారాయణరెడ్డి, నూర్‌ మహమ్మద్‌ ఇళ్లకు వెళ్లారు. పాతూరులో ముత్యాలరంగయ్య ఇటీవల కరోనాతో మరణించగా... టీడీపీ ఆర్యవైశ్య నాయకులు చక్కా నాగేంద్ర, బాలసుబ్రహ్మణ్యం, రంగనాథ్‌తో కలిసి ఆయన ఇంటికి, ఏ నారాయణపురంలో మునీంద్ర ఇంటికి వెళ్ళారు. ఆయా కుటుంబసభ్యులతో కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడారు. వారి ఆరోగ్య, కుటుంబ సమాచారాలు తెలుసుకున్నారు. మన మందరం టీడీపీ వాళ్లమే కష్టపడి పనిచే ద్దాం. నారా చంద్రబాబు నాయుడును సీఎంను చేసుకుందామని, ఇందుకు కలిసి నడిచేందుకు ముందుకు రావాలని జేసీపీఆర్‌ వారికి సూచించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు బుగ్గ య్యచౌదరి, జేఎల్‌ మురళీధర్‌, కిరణ్‌గౌడ్‌, రాయల్‌మురళి, కృష్ణకుమార్‌, లక్ష్మీన రసింహ, వెంకటప్ప, చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు.