నియోజకవర్గానికో వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల

ABN , First Publish Date - 2021-10-24T03:23:54+05:30 IST

జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ పరమేశ్వరుడు తెలిపారు.

నియోజకవర్గానికో వ్యాధి నిర్ధారణ ప్రయోగశాల
శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న అధికారులు, నేతలు

పశు సంవర్ధక శాఖ జేడీ పరమేశ్వరుడు 

నెల్లూరురూరల్‌, అక్టోబరు 23 : జిల్లాలోని ప్రతి నియోజకవర్గానికి ఒక వ్యాధి నిర్ధారణ ప్రయోగశాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పశుసంవర్ధక శాఖ జేడీ డాక్టర్‌ పరమేశ్వరుడు తెలిపారు. నెల్లూరు రూరల్‌ ఎంపీపీ బూడిద విజయకుమార్‌తో కలిసి మండలంలోని సౌత్‌మోపూరులో ఆర్‌కేవీవై నిధులు రూ.13 లక్షలతో  నిర్మించనున్న నూతన భవనానికి శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల్లో తలెత్తే వ్యాధులకు నియోజకవర్గం స్థాయిలోనే నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తారని, వ్యాధిని బట్టి అక్కడికక్కడే చికిత్స చేయడం, లేదా సిఫార్సు చేసి సకాలంలో మెరుగైన వైద్యం అందిస్తారని చెప్పారు.  సీజనల్‌ వ్యాధుల పట్ల పశుపోషకులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడీ డాక్టర్‌ సురేష్‌, ఏడీడీఎల్‌ ఏడీ డాక్టర్‌ జానా చైతన్య కిషోర్‌, వైస్‌ ఎంపీపీ రవీంద్రరెడ్డి, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు అల్లాబక్షు, సర్పంచు పోలయ్య, ఎంపీటీసీ చెంచయ్య, నెల్లూరు ఏఎంసీ డైరెక్టర్‌ రాపూరు చంద్రశేఖర్‌, పశు వైద్యులు మహేంద్ర, కృష్ణమూర్తి పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-24T03:23:54+05:30 IST