ప్రధాని మోదీకి కుమారస్వామి ఛాలెంజ్

ABN , First Publish Date - 2020-04-05T19:14:43+05:30 IST

ఏప్రిల్ 5న.. ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్‌ లైట్లు ఆర్పి చమురు లేదా కొవ్వొత్తి దీపాలు వెలిగించండని...

ప్రధాని మోదీకి కుమారస్వామి ఛాలెంజ్

బెంగళూరు: ఏప్రిల్ 5న.. ఆదివారం రాత్రి 9 గంటలకు విద్యుత్‌ లైట్లు ఆర్పి చమురు లేదా కొవ్వొత్తి దీపాలు వెలిగించండని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత కుమారస్వామి మండిపడ్డారు. మోదీ జిత్తులమారి ఆలోచనతో బీజేపీ ఆవిర్భావ దినోత్సవ నేపథ్యంలో దేశ ప్రజలంతా దీపాలు వెలిగించాలని ఈ పిలుపునిచ్చారా అని ఆయన ప్రశ్నించారు. ఏప్రిల్ 6న బీజేపీ ఆవిర్భావ దినం అని, దీపాలు వెలిగించడానికి ఎంచుకున్న తేదీ, సమయంపై ఏం వివరణ ఇస్తారని కుమారస్వామి నిలదీశారు. ఈ దీపాలు వెలిగిస్తే ఏం జరుగుతుందో శాస్త్రీయ, హేతుబద్ధమైన వివరణ ఇవ్వాలని తాను మోదీని ఛాలెంజ్ చేస్తున్నట్లు ఆయన ట్వీట్ చేశారు.


వైద్యులకు పీపీఈ కిట్లను, సామాన్యులకు అందుబాటులో ఉండేలా కరోనా టెస్ట్ కిట్లను అందించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కొనేందుకు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రజలకు వివరించకుండా, అర్థం లేని పనులకు ప్రధాని పిలుపునిస్తున్నారని కుమారస్వామి విమర్శించారు. దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఒక విపత్తును తమ ఉన్నతిని చాటుకునేందుకు వేదికగా మార్చుకోవాలని భావించడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. ప్రపంచవ్యాప్త విపత్తును తమ పార్టీ రహస్య ఎజెండాను అమలుచేసేందుకు వాడుకోవడం సిగ్గుచేటని కుమారస్వామి ట్వీట్ చేశారు.




Updated Date - 2020-04-05T19:14:43+05:30 IST