జేఈఈ మెయిన్‌ ‘కీ’లో ముగ్గురికి 100%

ABN , First Publish Date - 2021-08-01T08:49:25+05:30 IST

ఇటీవలే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించిన మూడోవిడత జేఈఈ మెయిన్‌ పరీక్ష ప్రాథమిక ‘కీ’లో ముగ్గురు విద్యార్థులకు 100శాతం మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నారాయణ విద్యాసంస్థల గ్రూప్‌ డైరెక్టర్లు

జేఈఈ మెయిన్‌ ‘కీ’లో ముగ్గురికి 100%

నారాయణ విద్యాసంస్థల గ్రూప్‌ డైరెక్టర్లు 


హైదరాబాద్‌, జూలై 31(ఆంధ్రజ్యోతి): ఇటీవలే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించిన మూడోవిడత జేఈఈ మెయిన్‌ పరీక్ష ప్రాథమిక ‘కీ’లో ముగ్గురు విద్యార్థులకు 100శాతం మార్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయని నారాయణ విద్యాసంస్థల గ్రూప్‌ డైరెక్టర్లు పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. విజయవాడలోని తమ విద్యాసంస్థలో చదువుతున్న కడప జిల్లా మైదుకూరుకు చెందిన పి.వీరశివ, ప్రకాశం జిల్లాకు చెందిన కె.రాహుల్‌నాయుడు, బెంగళూరులోని నారాయణ కళాశాలలో చదువుతున్న గౌరభ్‌దాస్‌ 300 మార్కులు సాధిస్తున్నారని తెలిపారు. ప్రాథమిక కీలో ఎలాంటి మార్పులు లేకపోతే వీరు జాతీయస్థాయిలో మొదటి 10 స్థానాల్లో నిలిచే అవకాశాలున్నాయన్నారు. 

Updated Date - 2021-08-01T08:49:25+05:30 IST