కాఫీ తోటల్లో సాహస క్రీడ.. ప్రజల ఆగ్రహం

ABN , First Publish Date - 2020-09-18T00:23:37+05:30 IST

కాఫీనాడుగా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో సాహస క్రీడలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొండల నడుమ మట్టి రోడ్లపై...

కాఫీ తోటల్లో సాహస క్రీడ.. ప్రజల ఆగ్రహం

కర్ణాటక: కాఫీనాడుగా ప్రసిద్ధి చెందిన ప్రాంతంలో సాహస క్రీడలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కొండల నడుమ మట్టి రోడ్లపై జీప్ ర్యాలీలు తరచుగా నిర్వహిస్తూ ఉంటారు. ఇలాంటి క్రీడల వల్ల పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కరోనా కారణంగా ఆరు నెలలుగా అక్కడ ఎలాంటి ఈవెంట్లు నిర్వహించలేదు. అయితే ఇప్పుడు కొత్తగా జీప్ ర్యాలీ నిర్వహించడం వివాదస్పదం అవుతోంది. దానికి కారణం కరోనా మాత్రం కాదు. అక్కడి ప్రజల ఇబ్బందులు. 


మలినాడు ప్రాంతంలో కాఫీ తోటలు ఎక్కువగా ఉంటాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండల నడుమ మట్టి రోడ్లు ఉంటాయి. ఆ మట్టి రోడ్ల మీదుగా జీపుల్లో పయనాన్ని యువతీయువకులు ఆశ్వాదిస్తారు. అది కొండ అంచులపై సాగే ప్రయాణం కాబట్టి సాహసోపేతంగా సాగుతూ ఉంటుంది. దాదాపుగా ముప్పై కిలో మీటర్ల మేర  ర్యాలీలు జరుగుతూ ఉంటాయి. చాలా రోజుల తర్వాత ర్యాలీ ఏర్పాటు చేయడంతో జీపు డ్రైవింగ్, హెల్ డ్రైవింగ్‌పై ఆసక్తి ఉన్న వాళ్లంతా కూడా హాజరయ్యారు. ఉత్సాహకంగా పోటీలు జరిగాయి. కానీ అక్కడి ప్రజలు మాత్రం వీరి తీరుపై మండిపడ్డారు. 


కాఫీ నాడు ప్రాంతంలో ఇటీవల కాలంలో భారీ వర్షాలు కురిశాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యారు. వారు ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోకుండా కార్ల ర్యాలీల పేరుతో తమ ప్రాంతాన్ని నాశనం చేస్తున్నారని అక్కడి ప్రజలు మండిపడుతున్నారు. మొదట ఈ ర్యాలీకి అనుమతి తీసుకోలేదు. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో తర్వాత పర్మిషన్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 

Updated Date - 2020-09-18T00:23:37+05:30 IST